Asianet News TeluguAsianet News Telugu

Manoj Prabhakar: నేపాల్ క్రికెట్ టీమ్ హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్

Nepal Cricket Team: నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ప్రభాకర్ నియమితుడయ్యాడు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ కు బౌలింగ్ కోచ్ గా పనిచేసిన  ఆయన.. ఇప్పుడు నేపాల్ జట్టుకు పనిచేయనున్నాడు. 
 

Former India All Rounder Manoj Prabhakar Named As Head Coach of Nepal cricket Team
Author
First Published Aug 9, 2022, 2:18 PM IST

భారత మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. నేపాల్‌కు హెడ్ కోచ్ గా ఉన్న పుబుడు దస్సనాయకె  వ్యక్తిగత కారణాలతో గతనెలలో తన పదవికి రాజీనామా చేశాడు. కానీ ఆయన తర్వాత  కెనడా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. కాగా దస్సనాయకె రాజీనామా చేయడంతో నేపాల్ మెడ్ కోచ్ బాధ్యతలను ప్రభాకర్ నిర్వర్తించనున్నాడు. 

భారత్ తరఫున 130 వన్డేలు, 39 టెస్టులాడాడు ప్రభాకర్. 1984 నుంచి 1996 వరకు టీమిండియాకు ఆడాడు. 39 టెస్టులలో 1,600 పరుగులు చేసి 96 వికెట్లు పడగొట్టాడు.  130 వన్డేలలో 1,858 పరుగులు చేసి 157 వికెట్లు తీశాడు. టెస్టులో ఒక సెంచరీ చేసిన ప్రభాకర్.. వన్డేలలో రెండు సెంచరీలు చేశాడు.  

నేపాల్ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేయడానికి ముందు అతడు.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. అంతకుముందే ప్రభాకర్.. ఢిల్లీ,  రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ జట్లకు కోచ్ గా  సేవలందించాడు. 

 

‘టీమిండియా మాజీ ఆల్ రౌండర్, రంజీ ట్రోఫీ విన్నింగ్ కోచ్ మనోజ్ ప్రభాకర్  నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్ గా నియమితుడయ్యాడు. ప్రభాకర్ భారత్  తరఫున 169  అంతర్జాతీయ మ్యాచులాడాడు. కోచ్ గా అతడు రంజీలో పలు జట్లకు, అఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ కు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.  అతడు  నేపాల్ క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్తాడని ఆశిస్తున్నాం..’ అని నేపాల్ క్రికెట్  అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇక తన నియామకంపై ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘నేపాల్ క్రికెట్ పట్ల ఆసక్తి చూస్తుంటే ముచ్చటేస్తోంది. నేపాల్ ఆటగాళ్లతో కలిసి పనిచేయాలని నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని ప్రభాకర్ తెలిపాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios