Big Bash League: క్రికెట్ ను ప్రసారం చేసే పలు బ్రాడ్ కాస్ట్ లు లేడీ యాంకర్ లను, కామెంటేటర్లను నియమించుకుంటున్నాయి. ఇక వీళ్లు తమ ఆట పాటలతో పాటు హోయలతో కూడా క్రికెట్ అభిమానులను గిలిగింతలు పెడుతున్నారు.

టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆటతో పాటు వినోదం కూడా పంచాల్సిందే అనే విషయం స్థిరపడిపోయింది. గ్రౌండ్ లో ఆటగాళ్ల భావోద్వేగాలు సరాసరి.. దానికి మించి గ్లామర్ కూడా ఉండాల్సిందే. అందుకే పలు బ్రాడ్ కాస్ట్ (క్రికెట్ ను ప్రసారం చేసే టీవీలు) లు లేడీ యాంకర్ లను, కామెంటేటర్లను కూడా నియమించుకుంటున్నాయి. ఇక వీళ్లు తమ ఆట పాటలతో పాటు హోయలతో కూడా క్రికెట్ అభిమానులను గిలిగింతలు పెడుతున్నారు. వెనుకటి రోజుల్లో ఏదో క్రికెట్ జరిగినంత సేపు కామంట్రీ చెప్పామా..? వెళ్లామా..? అన్నట్టు కాకుండా దాని స్టైల్ ను మార్చేశారు. తాజాగా వచ్చే కామెంటేటర్లైతే కాస్త మసాలా కూడా యాడ్ చేస్తున్నారు. 

తాజాగా ఓ మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇసా గుహా.. ‘మీది ఎంత పెద్దది..’ అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. ఆమె ఈ మాట అన్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ మాటకు ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

అసలేం జరిగిందంటే.. 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యాతగా ఉన్నాడు. అతడితో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన ఇసా గుహా కూడా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. ఓ మ్యాచ్ సందర్భంగా గిల్ క్రిస్ట్, ఇస గుహా, మరో వ్యాఖ్యాత కామెంట్రీ చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు వ్యాఖ్యాత ఆధునిక క్రికెట్ లో క్యారమ్ బాల్ గురించి ఇలా అన్నాడు. 

Scroll to load tweet…

‘స్పిన్ బౌలింగ్ కోచ్ లంతా అక్కడకు వచ్చే బౌలర్లను.. మీరు బౌలింగ్ చేసే చేతిని చూపించండి అని అడుగుతారు. అక్కడకు వచ్చేవారిలో ఎవరికైనా చేతి మధ్య వేలు పొడువుగా ఉంటే అతడు క్యారమ్ బాల్ వేయగలడని గుర్తిస్తారు. మధ్య వేలు పొడవుగా ఉన్నవాళ్లు క్యారమ్ బాల్ ను బాగా వేయగలుగుతారు..’ అని చెప్పాడు. అంతలోనే అక్కడే ఉన్న గుహా మధ్యలో కల్పించుకుని.. ‘మీది (చేతి మధ్య వేలు) ఎంత పొడవుంది..’అని వ్యాఖ్యానించింది. అంతే.. ఆ మాటకు సదరు వ్యాఖ్యాతతో పాటు గిల్ క్రిస్ట్ కు మైండ్ పోయింది. వాళ్లకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. 

Scroll to load tweet…

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. మాజీ క్రికెటర్ అలెగ్జాండ్ర హర్ట్లే వీడియో షేర్ చేసింది. అందులో ఆమె.. ‘ఒక సహేతుకమైన ప్రశ్న..’ అని ట్వీట్ చేసింది. ఈ వీడియోకు ఇసా గుహా రిప్లై ఇచ్చింది. ‘క్యారమ్ బాల్స్ మాత్రమే..’ అని రాసుకొచ్చింది. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నా.. సామాజిక మాధ్యమాల్లో నెటిజనులు మాత్రం ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు.