ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పై ప్రశంసల వర్షం కురిపించిన నిక్ కాంప్టన్... కోహ్లీ పై మాత్రం తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ తీవ్ర విమర్శలు చేశారు. చెత్తమాటలు మాట్లాడటంలో.. కోహ్లీ నెంబర్ వన్ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పై ప్రశంసలు కురిపిస్తూనే.. కోహ్లీపై విమర్శలు చేయడం గమనార్హం.
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పై ప్రశంసల వర్షం కురిపించిన నిక్ కాంప్టన్... కోహ్లీ పై మాత్రం తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.
కోహ్లీకి చాలా నోటిదూల ఎక్కువ అని.. దుర్మార్గమైన వ్యక్తి అంటూ విమర్శించాడు. 2012లో తనకు ఎదురైన సందర్భాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నిక్ కాంప్టన్ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
కాగా.. నిక్ కాంప్టన్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అండర్సన్.. అశ్విన్ ని హేలన చేసినప్పుడు ఎక్కడ ఉన్నావు..? బుమ్రాపై విమర్శలు చేసినప్పుడు ఏం చేశావ్ అంటూ ప్రశ్నించడం గమనార్హం.
కాగా.. కొందరు.. టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ విమర్శించడం గమనార్హం. ఇంకొందరేమో.. 2012 నాటి సంఘటనకు ఇప్పటికీ ఏడుస్తున్నావా అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.