WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో తొలిసారిగా నిర్వహించిన వేలం సూపర్ సక్సెస్ అయింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర దక్కించుకుంది. స్టార్ ప్లేయర్ల కోసం ఐదు టీమ్‌లు పోటీపడ్డాయి.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా సోమవారం ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం విజయవంతంగా ముగిసింది. డబ్ల్యూపీఎల్ లో భాగంగా బీసీసీఐ తొలిసారి నిర్వహించిన ఈ వేలంలో ఐదు జట్లూ ఆటగాళ్లను దక్కించుకోవడాని పోటాపోటీగా పాల్గొన్నాయి. భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఐదు ఫ్రాంచైజీలు ఆల్ రౌండర్లపైనా కన్నేశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్లూ భారీ ధర దక్కించుకున్నారు. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రూ. 3.40 కోట్లతో రికార్డు ధర దక్కించుకుని తొలి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ గా రికార్డులకెక్కింది.
వేలం ముగిసిన నేపథ్యంలో ముంబై, బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ, యూపీ వారియర్స్ లు ఎవరెవరిని తీసుకున్నాయి..? ఎంత ఖర్చు చేశాయి...? విదేశీ ఆటగాళ్లు ఎవరు..? అమ్ముడుపోని ఆటగాళ్లు ఎవరు..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.
ఎంతమంది..? వెచ్చించింది ఎంత..?
- వేలంలో సుమారు 440 మంది పోటీ పడ్డారు. వీరిలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసింది 87 మందినే. వీరిలో 30 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. 57 మంది భారతీయ క్రికెటర్లు. వేలంలో భారతీయ క్రికెటర్ల (57 మంది) కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 31.95 కోట్లను వెచ్చించాయి. ఐదు టీమ్ లు 14 మంది ఆస్ట్రేలియా ప్లేయర్లను (మొత్తం 30 మందిలో వీరే అధికం) రూ. 14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశాయి. మొత్తంగా ఐదు ఫ్రాంచైజీలు రూ. 60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ. 59.50 కోట్లు వెచ్చించాయి.
టాప్ - 5 బిడ్స్
1. స్మృతి మంధాన (బెంగళూరు రూ. 3.4 కోట్లు)
2. ఆష్లే గార్డ్‌నర్ (గుజరాత్ రూ. 3.2 కోట్లు)
3. నటాలియా సీవర్ (ముంబై రూ. 3.2 కోట్లు)
4. దీప్తి శర్మ (యూపీ రూ. 2.6 కోట్లు)
5. జెమీమా రోడ్రిగ్స్ (డిల్లీ రూ. 2.2 కోట్లు)
భారత క్రికెటర్లకు..
1. స్మృతి మంధాన (బెంగళూరు రూ. 3.4 కోట్లు)
2. దీప్తి శర్మ (యూపీ రూ. 2.6 కోట్లు)
3. జెమీమా రోడ్రిగ్స్ (డిల్లీ రూ. 2.2 కోట్లు)
4. షఫాలీ వర్మ (ఢిల్లీ రూ. 2 కోట్లు)
5. రిచా ఘోష్ (బెంగళూరు రూ. 1.90 కోట్లు)
6. పూజా వస్త్రకార్ (ముంబై రూ. 1.80 కోట్లు)
7. హర్మన్‌ప్రీత్ కౌర్ (ముంబై రూ. 1.80 కోట్లు)
8. యస్తికా భాటియా (ముంబై రూ. 1.50 కోట్లు)
9. రేణుకా సింగ్ ఠాకూర్ (బెంగళూరు రూ. 1.50 కోట్లు)
10. దేవికా వైద్య (యూపీ రూ. 1.40 కోట్లు)
అమ్ముడుపోని ప్రముఖ క్రికెటర్లు :
వేలంలో అన్ని ఫ్రాంచైజీలు 87 మందిని తీసుకున్నాయి. మిగిలినవారిపై ఐదు టీమ్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. వీరిలో ప్రముఖంగా సూజీ బేట్స్, లారా వోల్వార్డ్ట్ , టమ్సిన్ బ్యూమంట్, డాని వ్యాట్, అలానా కింగ్, స్వాగతిక రాత్, ఈశ్వరి సావ్కర్, షిప్ర గిరి, టెస్ ఫ్లింటాఫ్ , నీతూ సింగ్, సోనమ్ యాదవ్, జి. త్రిష, సల్మా ఖాటూన్, సౌతాఫ్రికా సారథి సున్ లూజీ, శ్రీలంక సారథి చమారీ ఆటపట్టు, కివీస్ సీమర్ లీ తహుహు , సౌతాఫ్రికా క్రికెటర్ ఆయబొంగ ఖాకా, షకీరా సెల్మన్ లకు నిరాశ తప్పలేదు.
ఐదు ఫ్రాంచైజీల పూర్తి జట్లు :
1. గుజరాత్ జెయింట్స్ : ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్, సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరుణిక సిసోడియా
2. బెంగళూరు : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్
3. ముంబై : హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్
4. ఢిల్లీ : జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి
5. యూపీ : సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్‌గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షేక్
