ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ జట్టు బౌలింగ్, కూర్పు తదితర అంశాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్‌ టీంలో భాగంగా ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

ఈ బౌలింగ్ టీంలో ఉండటం కంటే మరో మంచి విషయం లేదు.  టాలెంట్, పేస్ భారత జట్టుకు ప్రధాన బలాలు. అవి మాకు ఎంతో నమ్మకాన్ని ఇస్తాయి. నిజంగా చెప్పాలంటే నా కల నెరవేరినట్లు ఉంది. మా బౌలింగ్ టీంని బెస్ట్ టీమ్ అని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే.. గర్వంగా ఉందన్నాడు.

ఆ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను.. వైట్ బాల్ క్రికెట్‌లో తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. ఈ అవకాశం కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూశానని .. తానేంటో ఇంగ్లాండ్‌లో చూపిస్తానని షమీ ధీమా వ్యక్తం చేశాడు.

కాగా ఐపీఎల్‌తో సహా ఇటీవల ముగిసన పలు వన్డే, టెస్ట్ సిరీస్‌లలో షమీ అద్బుతంగా రాణించడంతో ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.  ఇతని జోరుపై పలువురు మాజీలు సైతం నమ్మకం ఉంచుతున్నారు.