Asianet News TeluguAsianet News Telugu

క్రీజులోకి దూసుకొచ్చిన అభిమాని... విరాట్ కోహ్లీని తాకి ఉంటే, పరిస్థితి ఏంటి... వైరల్ వీడియో...

బయో బబుల్ జోన్ దాటి క్రీజులోకి దూసుకొచ్చిన అభిమాని...

వెంటనే గుర్తించి, దగ్గరికి రావొద్దని అడ్డుకున్న విరాట్ కోహ్లీ...

బయటి వ్యక్తులు విరాట్ కోహ్లీని తాకి ఉంటే...?

fans breaks corona protocol to meet Virat kohli in Pink Ball Test, BCCI responds CRA
Author
India, First Published Feb 26, 2021, 11:08 AM IST

ఇంగ్లాండ్‌తో పింక్ బాల్ టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఎవరినో చూసి కంగారు పడుతూ వెనక్కి వెళ్లడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఎవరినో హఠాత్తుగా గమనించిన కోహ్లీ... వెనక్కి వెళుతూ దూరం ఉండాల్సిందిగా చేతులతో సైగలు చేయడం కనిపించింది. 

కరోనా నియమాల కారణంగా క్రికెటర్లు, బయటి వ్యక్తులను కలవడం, తాకడంపై పూర్తి నిషేధం ఉంది. బయో బబుల్ సెక్యూలర్ జోన్ దాటిన క్రికెటర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది బీసీసీఐ.

అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఓ అభిమాని, క్రీజులోపలికి ఎలా రాగలిగాడు? కంచెను దాటి, విరాట్ కోహ్లీ దాకా ఎలా దూసుకొచ్చాడు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, క్రీజులోకి దూసుకొచ్చిన వ్యక్తిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది బీసీసీఐ.

అయితే క్రీజులోకి వచ్చిన అతన్ని కోహ్లీ గమనించకపోయి ఉంటే, విరాట్‌ను అభిమాని తాకి ఉంటే ఏం చేసేవారు? ఆటను నిలిపివేసి భారత సారథిని క్వారంటైన్‌కి తరలించేవారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios