Kane Williamson With Manoj Bajpayee: న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్.. బాలీవుడ్ సూపర్ స్టార్ మనోజ్ బాజ్పేయితో ముచ్చటించాడు. అమెజాన్ ప్రైమ్ ఇందుకు వేదికైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని విదేశీ క్రికెటర్లు అయినా ఇండియాలో వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండేది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిన అతడిని.. ఫ్యాన్స్ అంతా ‘కేన్ మామ’ అని పిలుస్తుంటారు. అభిమానులపై కేన్ మామ కూడా అంతే సఖ్యంగా నడుచుకుంటాడు. అయితే తాజాగా కేన్.. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయితో ముచ్చటించాడు. అమెజాన్ ప్రైమ్ ఇందుకు వేదికైంది. ప్రైమ్ విడుదల చేసిన ఓ వీడియోలో ఈ ఇద్దరు స్టార్లు.. పలు విషయాలపై ముచ్చటించుకున్నారు.
వీడియోలో న్యూజిలాండ్ సారథిని ఫ్యామిలీ మ్యాన్ కు పలు ప్రశ్నలు వేశాడు. దీనికి కేన్ మామ కూడా ఫన్నీగా ఆన్సర్స్ చెప్పాడు. ఫ్యామిలీ ఒత్తిడిని తట్టుకోవడానికి ఏం చేస్తాడో కేన్ మామ వివరించాడు. తన జట్టు సహచరుల గురించి కూడా ఇందులో చెప్పుకొచ్చాడు.

ఈ ఇంటరాక్షన్ లో భాగంగా మనోజ్.. అమెజాన్ ప్రైమ్ లో నీకు నచ్చిన షో ఏంటని కేన్ ను అడిగాడు. అతడు.. తన ఫ్యామిలీ మ్యాన్ పేరు చెప్తాడేమో అని ఆసక్తిగా చూశాడు. కానీ కేన్ మామ మాత్రం.. ‘మీర్జాపూర్..’ అని చెప్పడం విశేషం. దీంతో మనోజ్ ముఖం మాడిపోయింది. ఇక విలియమ్సన్ ఆ ఆన్సర్ చెప్పగానే మనోజ్ బాజ్పేయి.. ‘బాయ్ కేన్..’ అని బదులిచ్చాడు. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలి ఫజల్ నటించిన మీర్జాపూర్.. ఒక క్రైమ్ థ్రిల్లర్. రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్.. నెట్టింట పెద్ద సంచలనం. మూడో సీజన్ కోసం యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
ఇందుకు సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. ఇదిలాఉండగా.. త్వరలోనే బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ ఏడాది బంగ్లాలో జరిగిన టీ20 సిరీస్ లో ఆ జట్టు కివీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఓటమికి బదులు తీర్చుకోవాలని ప్రపంచ టెస్టు ఛాంపియన్లు భావిస్తున్నారు. అయితే రాబోయే సిరీస్ కు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదు.
కొన్నాళ్లుగా అతడు చేతి నొప్పితో బాధపడుతున్నాడు. దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడినా.. విలియమ్సన్ మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత టెస్టు సిరీస్ లో కూడా తొలి టెస్టు మాత్రమే ఆడాడు.
