ఆస్ట్రేలియా టూర్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నానని.. కానీ కుదరలేదన్నాడు
దక్షిణాఫ్రికా లెంజరీ క్రికెటర్, ఆజట్టు టెస్టు కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఆయన బుధవారం తన రిటైర్మెంట్ ప్రకటించారు.
వరుస వైఫల్యాలు వెంటాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మానసికంగా తాను రిటైర్మెంట్‌కు సిద్ధమయ్యాయని, అయితే తాను ఊహించినట్టు రిటైర్మెంట్ లేదని ఇన్‌స్టా పోస్టులో తెలిపాడు. అసలు తాను ఆస్ట్రేలియా టూర్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నానని.. కానీ కుదరలేదన్నాడు. సరికొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. ఇకపై టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపాడు. 2021, 2022లలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.
36 ఏళ్ల డూప్లెసిస్ 69 టెస్టులు ఆడాడు. 2012-13 సంవత్సరంలో తొలి టెస్ట్ ఆడాడు. తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. 40.02 సగటుతో మొత్తం 4163 పరుగులు చేశాడు. 2016లో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొత్తం 36 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించగా, అందులో 18 గెలుపులు, 15 ఓటములు ఉన్నాయి.
