శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 276 బంతుల్లో 24 ఫోర్లతో 199 పరుగులు చేసిన డుప్లిసిస్... ఈ స్కోరు వద్ద అవుటైన 11వ ప్లేయర్‌గా నిలిచాడు.

2017లో సౌతాఫ్రికా ప్లేయర్ డీన్ ఇల్గర్ 199 పరుగుల వద్ద అవుట్ కాగా, అదే స్కోరు వద్ద అవుటైన రెండో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లిసిస్. ఇంతకుముందు ముదస్సర్ నాజర్, అజారుద్దీన్, ఎలియట్, జయసూర్య స్టీవ్ వాగ్, యూనిస్ ఖాన్, ఇయాన్ బెల్, స్టీవ్ స్మిత్, కెఎల్ రాహుల్, డీన్ ఇల్గర్ 199 పరుగుల వద్ద అవుట్ కాగా... ఫ్లవర్, సంగర్కర 199 పరుగులతో అజేయంగా నిలిచారు.

డుప్లిసిస్ భారీ స్కోరు కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 621 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇల్గర్ 95 పరుగులు చేయగా మర్కమ్ 68, బవుమ 71, మహరాజ్ 73 పరుగులు చేశారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది.