స్ఫూర్తి ఆయనే... ఎవ్వరూ కదిలించలేరు, నేను అంతే: సెహ్వాగ్
ఫుట్‌వర్క్ లేకుండా ఉన్నచోట నుంచే బంతిని బౌండరీ దాటించే హిట్టర్. ఈ క్రమంలో ఈ విధ్వంసక ఆటగాడికి బ్యాటింగ్‌లో స్ఫూర్తి ఎవరో తెలుసా..? భారత రామాయణంలోని వాలి కుమారుడు అంగదుడేనట.
ఆదివారం రాత్రి ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన.. వీరూ ఈ విషయాన్ని వెల్లడించాడు. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అవుతాడు. వాలి కుమారుడు అంగదుడు యువరాజు అవుతాడు.
ఇక రావణుడితో యుద్ధానికి ముందు రాముడు సంధి కోసం చివరిసారి రాయబారానికి పంపుతాడు. ఈ సందర్భంగా రావణుడికి ముందు అంగదుడు తన వీరత్వంతో పాటు బలప్రదర్శననూ చూపిస్తాడు. పుట్టుకతోనే అంగదుడు ఎంతో బలవంతుడు. ఒక్కసారి ఆయన కాలుపెట్టి నిలపెడితే కదిలించడం ఎవరితరం కాదు.
ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ‘‘ అంగద్ జీ రాక్స్’’ అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ నిజంగానే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఎన్నోసార్లు బెంబేలెత్తించాడు. ఒకసారి క్రీజులో కుదురుకున్నాడంటే వీరేంద్రుడిని ఆపడం ఎవరి వల్లా కాదని ఎన్నోసార్లు నిరూపించాడు.