Asianet News TeluguAsianet News Telugu

IPL2021:PBK vs KKR ఇది మీకు ఔట్ లాగా కనపడటం లేదా..? మండిపడుతున్న నెటిజన్లు

ఆ సమయంలో పంజాబ్ జట్టు 52 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా క్యాచ్ పట్టాడు.
 

Ex cricketers fans slam third umpire for declining KL Rahul's crucial catch during PBKS vs KKR
Author
Hyderabad, First Published Oct 2, 2021, 9:37 AM IST

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే  గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్‌లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరిలో కేఎల్ రాహుల్ కూడా అవుటైనా షారుక్ ఖాన్ (22) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ విజయం సాధించింది. 

 చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు చేయాల్సి ఉండగా జట్టుకు అదృష్టం లభించింది.ఆ సమయంలో పంజాబ్ జట్టు 52 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా క్యాచ్ పట్టాడు.

 

 అయితే.. ఆ క్యాచ్ ని  అంపైర్ పట్టించుకోకపోవడం గమనార్హం.  అంపైర్.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. అంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి  చేసింది. అది క్లియర్ గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజ్ల వరకు అందరూ విమర్శించడం  గమనార్హం. ఈ మ్యాచ్ లో చివరికు విజయం పంజాబ్ కే దక్కింది. 

కాగా.. మ్యాచ్ ముగిసిన వెంటనే, క్రికెట్ ప్రియులు, అభిమానులు ట్విట్టర్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం తప్పు  అంటూ విమర్శించడం మొదలుపెట్టారు.  భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. అది ఔట్ లాగా కనిపించడం లేదా అంటూ ప్రశ్నించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios