ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి, ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. మొదటి నాలుగు టీ20ల్లో చెరో రెండు మ్యాచులు గెలిచిన ఇండియా, ఇంగ్లాండ్ జట్లు 2-2 తేడాతో సమంగా ఉండడంతో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించడానికి ఆఖరి టీ20 మ్యాచ్ కీలకం కానుంది. 

వరుసగా విఫలమవుతున్న కెఎల్ రాహుల్ స్థానంలో పేసర్ నటరాజన్ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ వస్తుండగా వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి రానున్నాడు. ..

భారత జట్టు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్

ఇంగ్లాండ్ జట్టు:
ఇయాన్ మోర్గాన్, జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్