ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేయనుంది. మొదటి రెండు వన్డేల్లో చెరో వన్డే గెలిచిన ఇండియా, ఇంగ్లాండ్ 1-1 తేడాతో సమంగా ఉన్న విషయం తెలిసిందే.  

మొదటి రెండు వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్‌కి తుది జట్టులో చోటు కల్పించాడు విరాట్ కోహ్లీ. భారత జట్టులో కృనాల్ పాండ్యా ఒక్కటే స్పిన్నర్‌గా ఉన్నాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ 

ఇంగ్లాండ్ జట్టు: జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలాన్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, అదిల్ రషీద్, రీస్ తోప్లే, మార్క్ వుడ్