మొతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టెస్టు ఇంగ్లాండ్ గెలవగా, వరుసగా రెండు టెస్టులు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.

సిరీస్ నిలుపుకోవాలంటే ఇంగ్లాండ్ ఈ టెస్టు గెలవడం తప్పనిసరి. మరోవైపు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా, ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
ఆఖరి టెస్టులో టీమిండియా కేవలం ఒకే మార్పుతో బరిలో దిగుతోంది.

రెస్టు తీసుకున్న బుమ్రా స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు రెండు మార్పులతో బరిలో దిగుతోంది. మొదటి టెస్టులో అదరగొట్టిన స్పిన్నర్ డొమినిక్ బేస్ తిరిగి జట్టులోకి రాగా, లారెన్స్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, పూజారా, కోహ్లీ, రహానే, రిషబ్ పంత్, అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ఇషాంత్ శర్మ.

ఇంగ్లాండ్ జట్టు: సిబ్లీ, జాక్ క్రావ్లే, జానీ బెయిర్‌స్టో, రూట్, బెన్ స్టోక్స్, ఓల్లీ పోప్, డానియల్ లారెన్స్, బెన్ ఫోక్స్, డొమినిక్ బేస్, జాక్ లీచ్, అండర్సన్