Asianet News TeluguAsianet News Telugu

ఫుట్ బాల్ పై నిషేధం విధించిన ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు

ప్రాక్టీస్ సెషన్లలో ఫుట్‌బాల్‌ను భాగం చేయాలా, పూర్తిగా తీసివేయాలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ చివరగా అంతిమ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో సాకర్‌ను భాగం చేయటంపై బ్యాన్ నిందించింది. 

England will no longer play foot ball in practice sessions
Author
London, First Published Jan 4, 2020, 1:08 PM IST

క్రికెట్ అభిమానులందరికి క్రికెట్ ప్లేయర్స్ ఫుట్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేసే సీన్స్ గుర్తుండే ఉంటాయి. భారతీయ ఆటగాళ్లు సైతం ఫుట్ బాల్ ని బాగా ఇష్టపడతారు. ఫిట్నెస్ సాధించేందుకు క్రికెటర్లు ఫుట్ బాల్ ను ఆశ్రయిస్తుంటారు. 

కాకపోతే ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు మాత్రం క్రికెటర్లు ఇక ఫుట్ బాల్ ఆడకుండా బాన్ విధించింది. ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి చాలా రోజులుగా బోర్డు ఆలోచనలను చేస్తూనే ఉంది. 

Also Read : అదొక చెత్త రూల్.. తీసేస్తే బెటర్: ఆలోచింపజేస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రతిపాదన

కప్రాక్టీస్ సెషన్లలో ఫుట్‌బాల్‌ను భాగం చేయాలా, పూర్తిగా తీసివేయాలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ చివరగా అంతిమ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో సాకర్‌ను భాగం చేయటంపై బ్యాన్ నిందించింది. 

డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మెన్స్‌ క్రికెట్‌ జట్టు ఆష్లె గిల్స్‌ తొలి నుంచీ కూడా ఫుట్ బాల్ కు ప్రతికూల స్వరం వినిపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌ ఆటగాడు రోరి బర్న్స్‌ ఫుట్‌బాల్‌ సంబంధిత గాయానికి గురయ్యాడు. 

దీంతో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌లో ఫుట్‌బాల్‌ను నిషేధిస్తున్నట్టు గిల్స్‌, చీఫ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌లు వెల్లడించారు. ఫుట్‌బాల్‌ ఆడుతుండగా బర్న్స్‌ చీలమండకు బలమైన గాయం అయ్యింది. 

Also Read: సిక్స్ కొడితే 250 డాలర్లు.. అంతా వాళ్లకి డొనేట్ చేస్తా: ఆసీస్ క్రికెటర్ మానవత్వం

దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బర్న్స్‌ దూరమయ్యాడు. జానీ బెయిర్‌స్టో, జో డెన్లీ, జేమ్స్‌ అండర్సన్‌లు సైతం గతంలో ఫుట్‌బాల్‌ ఆడుతూ గాయాలపాలయ్యారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో సాకర్‌పై ఆటగాళ్లు సానుకూలంగా ఉండటంతో ఇన్నాండ్లూ దీనిపై గిల్స్‌ వేచి చూశారు. 

జట్టులో ఆటగాళ్ల మధ్య మైత్రీ, టీం స్పిరిట్ పెంపొందించేందుకు సాకర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెటర్స్ గతంలో జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిపారు. అందుకని ఇన్ని రోజులపాటు దానిపై వేచి చూసారు. బర్న్స్‌ స్థానంలో మలన్‌, జేమ్స్‌ విన్సె, కీటన్‌ జెన్నింగ్స్‌లను సెలక్షన్‌ కమిటీ దక్షిణాఫ్రికాకు పంపించే అవకాశం ఉంది. 

ఇప్పటికే గాయం కారణంగా ఇబ్బందులు పడుతున్న స్టార్‌ సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌ సైతం సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం మరోసారి ఆర్చర్‌కు స్కానింగ్‌ చేసి, నివేదికలు వచ్చాక తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios