ఆడబిడ్డకు జన్మనిచ్చిన జోస్ బట్లర్ భార్య... రెండో కూతురికి మ్యాగీ బట్లర్ అని పేరు పెట్టేసిన బట్లర్ దంపతులు...
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్, రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లూయిస్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి ఓ ఆడబిడ్డ ఉండగా, తాజాగా జన్మించిన అమ్మాయికి మ్యాగీ బట్లర్ అని పేరు కూడా పెట్టేశారు బట్లర్ దంపతులు...
భార్యకు డెలివరీ సమయంలో తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న జోస్ బట్లర్, భారత్‌తో నాలుగో టెస్టుకి దూరంగా ఉన్నాడు. జోస్ బట్లర్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన ఓల్లీ పోప్, తనకి వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకుని తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్, యూఏఈలో జరిగే ఐపీఎల్ ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు... యూఏఈలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2020 టోర్నీలో జోస్ బట్లర్ కీలకం కానున్నాడు.
