Asianet News TeluguAsianet News Telugu

విదేశీ పర్యటనలన్నీ పరీక్షల్లా అనిపించేవి.. కష్టపడటం మాత్రమే తెలుసు.. విరాట్ కోహ్లీ

విదేశీ పర్యటనలన్నీ.. తనకు ఇంజినీరింగ్ పరీక్షల్లా అనిపించేవంటూ పేర్కొనడం గమనార్హం. కానీ ఇప్పుడు ఎలాంటి మ్యాచ్ కి భయపడకుండా రాటుదేలినట్లు చెప్పడం విశేషం.
 

England vs India: Treated Every Foreign Tour "Like An Engineering Exam" Before 2014 Australia Series, Says Virat Kohli
Author
Hyderabad, First Published Aug 5, 2021, 12:19 PM IST

టీమిండయిా ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ కోసం తలపడుతోంది. మొదటి రోజు ఆటలో మనవాళ్లు అదరగొట్టారు. తొలిరోజు భారత జట్టు ఆధిపత్యం కనపరిచింది. ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే ఆల్ అవుట్ చేసిన టీమిండియా.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 21 పరుగులు చేసింది.

కాగా.. మనవాళ్లు మొదటి రోజు ఆధిపత్యం దక్కించుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. తొలి రోజు దుమ్మురేపిన సందర్భంగా కెప్టెన్ కోహ్లీ.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడారు.

 గతంలో.. విదేశీ పర్యటనలన్నీ.. తనకు ఇంజినీరింగ్ పరీక్షల్లా అనిపించేవంటూ పేర్కొనడం గమనార్హం. కానీ ఇప్పుడు ఎలాంటి మ్యాచ్ కి భయపడకుండా రాటుదేలినట్లు చెప్పడం విశేషం.

2014-15 ఆస్ట్రేలియా పర్యటనకు ముందు.. తాను విదేశీ పర్యటనలను ఎలాగైనా పాస్ అవ్వాలి అనుకునే ఓ ఇంజినీరింగ్ పరీక్షగా భావించేవాడినని చెప్పాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలని.. తమ సత్తా అభిమానులకు చూపించాలని అనుకునేవాడనని కోహ్లీ పేర్కొన్నాడు.

తాను విరామ సమయంలో ఉన్నప్పుడే.. తనతో ఎవరు ఉన్నారు..? ఎవరు లేరు అనే విషయం అర్థమైందని చెప్పాడు. ఒక్కసారి కిందకు పడిపోయిన తర్వాత.. పైకి లాగడానికి సహాయం చేయడం ఎవరూ రారని తనకు అర్థమైందన్నాడు. అందుకే తాను జీవితంలో ఎవరి సహకారం లేకుండా.. ఎదగాలని కోరుకుంటానని.. తన ఆటతో ఎక్కువ కాలం అభిమానులు అలరించాలని అనుకుంటానని చెప్పాడు.

కష్టపడి పనిచేయడం మాత్రమే తనకు తెలుసునని.. దానిని మాత్రమే తాను నమ్ముతానని చెప్పడం విశేషం.

కోహ్లీ 2014 లో ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6 ,20 స్కోర్‌లను నమోదు చేశాడు, 10 ఇన్నింగ్స్‌లలో సగటున 13.50 మాత్రమే పరుగులు చేయడం గమనార్హం. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అతను తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు, టెస్ట్ సిరీస్‌లో 692 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో.. కోహ్లీ పైవిధంగా పేర్కొనడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios