Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ బ్యాటర్‌పై స్లెడ్జింగ్‌‌కు దిగిన జోస్ బట్లర్.. వీడియో వైరల్

AUS vs ENG: ఫీల్డ్ లో కూల్ గా కనిపించే ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ ఆస్ట్రేలియా లో తన పంథాను మార్చాడు. ఆసీస్ బ్యాటర్ ను  స్లెడ్జింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

England Skipper Jos Buttler Sledges Cameron Green, Video Went Viral
Author
First Published Nov 18, 2022, 11:01 AM IST

‘బీ లైక్ ఎ రోమన్ ఇన్ రోమ్’ అన్న సూత్రాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బాగానే ఒంటబట్టించుకున్నట్టున్నాడు. నెల రోజులుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న బట్లర్.. స్లెడ్జింగ్ కే బ్రాండ్ అంబాసిడర్లైన  ఆ జట్టు ఆటగాళ్లనే స్లెడ్జింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్  కామెరూన్ గ్రీన్ ను ఉద్దేశిస్తూ  స్లెడ్జింగ్ కు దిగాడు.    ‘ఐపీఎల్ యాక్షన్ వస్తుంది..’అని  గుర్తు  చేస్తూ గ్రీన్ తో మైండ్ గేమ్ ఆడాడు.

ఇంగ్లాండ్ నిర్దేశించిన   288 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా పటిష్టంగా రాణించింది. ఓపెనర్లిద్దరూ  147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  డేవిడ్ వార్నర్,   ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ లు నిష్క్రమించిన తర్వాత స్టీవ్  స్మిత్ తో కలిసి  కామెరూన్ గ్రీన్  ను  ఆసీస్ ను  నడిపించాడు. 

ఈ క్రమంలో 41వ ఓవర్లో బంతిని బట్లర్.. ఇంగ్లాండ్ స్పిన్నర్ లియామ్ డాసన్  కు  అందించాడు. ఆ ఓవర్లో రెండో బంతికి  గ్రీన్.. భారీ షాట్ ఆడబోయాడు. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి భారీ షాట్ ఆడినా  అది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు.   అప్పుడు బట్లర్.. ‘గుడ్ టు సీ సమ్ వన్ ప్లేయింగ్ షాట్ డాస్..’ అని   అన్నాడు. ఆ తర్వాత బంతిని  గ్రీన్  డిఫెండ్  చేశాడు.  దీంతో బట్లర్ ‘ఛేజింగ్ ది ఇంక్, ఛేజింగ్ ది ఇంక్ డాస్.. బిగ్ యాక్షన్ రాబోతుంది..’అని  ఐపీఎల్ మినీ వేలాన్ని ఉద్దేశిస్తూ  వ్యాఖ్యానించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం భారత్ లో జరిగిన సిరీస్ లో గ్రీన్ మెరుపులు మెరిపించాడు. దీంతో అతడిని  దక్కించుకునేందుకు పలు ఐపీఎల్  ఫ్రాంచైజీలు పావులు కదుపుతున్నాయి. డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ వేలంలో గ్రీన్ కు భారీ ధర  దక్కడం ఖాయమనే  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్  నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి  287 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లంతా విఫలమైనా డేవిడ్ మలన్  (134),డేవిడ్  విల్లీ (34) లు రాణించారు.  జోస్ బట్లర్ (29)  కూడా విఫలమయ్యాడు.  ఆస్ట్రేలియా సారథి జోస్ బట్లర్ 3, ఆడమ్ జంపా 3 వికెట్లు తీశారు.  

లక్ష్యాన్ని ఆస్ట్రేలియా.. 46.5 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (86), ట్రావిస్ హెడ్  (69), స్టీవ్ స్మిత్ (80), కామెరూన్ గ్రీన్ (20నాటౌట్) లు  రాణించారు. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా.  1-0తేడాతో గెలుపొందింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios