ఇంగ్లాండ్ జట్టు బుర్ర లేకుండా ఆడిందంటూ ట్రోల్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్...బ్యాటింగ్‌ లోపాలపై ఫోకస్ చేయకుండా, పిచ్‌పై కామెంట్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారంటూ... 

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తన హాస్యచతురతను ప్రదర్శిస్తూ, అభిమానుల మనసు దోచుకున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించిన సెహ్వాగ్, ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయంపై స్పందించాడు.

ఇంగ్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించి, సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లాండ్‌ జట్టుకి అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ‘ఇంగ్లాండ్ అహ్మదాబాద్‌లో ఓడిపోలేదు. ఇక్కడ ఓడిపోయింది...’ అంటూ మెదడు ఫోటోను పోస్టు చేశాడు వీరూ.

Scroll to load tweet…

ఇంగ్లాండ్ జట్టు బుర్ర లేకుండా, తెలివితక్కువగా ఆడిందని ట్రోల్ చేశాడు వీరూ. వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత కూడా బ్యాటింగ్ లోపాలపై ఫోకస్ చేయకుండా పిచ్‌పై ఆరోపణలు చేస్తూ గడిపేసింది ఇంగ్లాండ్. అందుకే ఇంగ్లాండ్‌ను ట్రోల్ చేస్తూ ఇలా ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.