Asianet News TeluguAsianet News Telugu

రిజ్వాన్ హాఫ్ పెంచరీ.. ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్ నిలిపిన పాకిస్తాన్..

PAK vs ENG:ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  158 పరుగులు చేసింది. 

England Needs  159 Runs To Win In First T20I Against Pakistan
Author
First Published Sep 20, 2022, 9:46 PM IST

ఆసియా కప్  ఫైనల్ లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడిన పాకిస్తాన్.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.  పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య  కరాచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాటర్లు రాణించడంతో నిర్ణీత  20 ఓవర్లలో ఆ జట్టు.. 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో68, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 31, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ కు మెరుగైన ఆరంభమే దక్కింది.  రిజ్వాన్ తో కలిసి బాబర్ ధాటిగా ఆడాడు.  ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు85 పరుగులు జోడించారు. పటిష్టమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.   

ఈ జోడీని అదిల్ రషీద్ విడదీశాడు. రషీద్ వేసిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో మూడో బంతికి బాబర్ బౌల్డ్ అయ్యాడు. కానీ అప్పటికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న  రిజ్వాన్ కూడా  బాబర్ నిష్క్రమించాక నెమ్మదించాడు. అంతేగాక అతడికి తోడుగా నిలిచేవారు కూడా ఎవరూ లేకపోవడంతో పాకిస్తాన్ స్కోరు అనుకున్న స్థాయిలో ముందుకు కదల్లేదు. 

వన్ డౌన్ లో వచ్చిన హైదర్ అలీ (11), షాన్ మసూద్ (7) లు  వెంటవెంటనే నిష్క్రమించారు. మహ్మద్ నవాజ్ (4) కూడా  మెరవలేదు.  ఇఫ్తికార్ అహ్మద్ (17 బంతుల్లో 28, 3 సిక్సర్లు) ఒక్కడే ఉన్నా  చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ పప్పులుడకలేదు.  

 

పాకిస్తాన్  తొలి 12 ఓవర్లలో  104 పరుగులు చేయగా చివరి 8 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా..  మోయిన్ అలీ,  సామ్ కరన్, లూక్ వుడ్  తలో వికెట్ దక్కించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios