ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఇంగ్లాండ్ ఓపెనర్లను డకౌట్ చేసిన బుమ్రా, షమీ... ఇంకా 269 పరుగుల దూరంలో ఇంగ్లాండ్...

లార్డ్స్ టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌కి కావల్సినంత మజాను అందిస్తోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 298/8 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... 271 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...

తొలి ఓవర్‌లో రోరీ బర్న్స్‌ను డకౌట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... ఆ తర్వాతి ఓవర్‌లో డొమినిక్ సిబ్లీని మహ్మద్ షమీ అవుట్ చేశాడు. ఇంగ్లాండ్‌కి వచ్చిన ఆ ఒక్క పరుగూ నో బాల్ రూపంలో ఎక్స్‌ట్రాగా రావడం విశేషం. బ్యాటింగ్‌తో అదరగొట్టి, భారత జట్టుకి భారీ ఆధిక్యాన్ని అందించిన బుమ్రా, షమీ... ఆ వెంటనే బాల్‌తోనూ ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపిస్తుండడం విశేషం.. 

బుమ్రాపైకి బౌన్సర్లు విసిరి, రెచ్చగొట్టిన ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి... భారత జట్టు ప్లేయర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని ప్రతిబింబించేలా ప్రతీ బంతీ, ఇంగ్లాండ్ జట్టు అహాన్ని దెబ్బతీసేలా సంధిస్తోంది భారత జట్టు...