ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా చేతిలో 7 పరుగుల తేడాలో ఇంగ్లాండ్ ఓటమి
T20 World Cup 2024 - ENG vs SA : సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్‌ల సూపర్ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా గెలిచింది. హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టన్ జోడీ అద్భుతంగా పోరాడినా ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించలేకపోయారు.
T20 World Cup 2024 - ENG vs SA : టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 లో ఉత్కంఠ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్త చేసింది సౌతాఫ్రికా. బ్యాటింగ్ తో పాటు కీలక సమయంలో బౌలింగ్ తో అదరగొడుతూ విక్టరీని అందుకుంది. సూపర్-8లోగ్రూప్-2 లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్లు గ్రాస్ ఐలెట్-సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. రెండు బలమైన జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఇరు జట్లను ఊరిస్తూ మ్యాచ్ మలుపులు తిరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన సౌతాఫ్రికా విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. క్వింటన్ డి కాక్ (65), మిల్లర్ (43)లు బ్యాటింగ్ లో అదరగొట్టడంతో ప్రోటీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ మంచి ఆరంభం లభించలేదు. చివరలో సౌతాఫ్రికా బౌలింగ్ ను చిత్తు చేస్తూ హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టన్ జోడీ అద్భుత ఇన్నింగ్ ఆడింది. ఈ ఇద్దరు ప్లేయర్లు మంచి ఇన్నింగ్స్ ఆడి పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. కీలక సమయంలో ఇద్దరు ఔట్ కావడంతో గెలిచే మ్యాచ్ లో ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. హ్యారీ బ్రూక్ 53 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడగా, లివింగ్‌స్టన్ 33 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
చివరి ఓవర్ వరకు ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి ఓవర్ తొలి బంతికే నార్కియా అద్భుత బౌలింగ్ తో హ్యారీ బ్రూక్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే, క్రీజులో ఉన్న సామ్ కుర్రాన్ ఫోర్ కొట్టి మ్యాచ్ కు ప్రాణం పోశాడు. రెండు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన సమయంలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా నార్కియా సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 7 పరుగుల తేడాతో ఉత్కంఠ పోరులో ఓటిమిని చవిచూసింది.
టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ