Asianet News TeluguAsianet News Telugu

కెఎల్ రాహుల్‌పైకి షాంపైన్ మూతలు విసిరిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్... స్టేడియంలోకి టీమిండియా అభిమాని...

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్‌పైకి షాంపైన్ క్రార్క్స్‌ విసిరిన ఇంగ్లాండ్ అభిమానులు... క్రీజులోకి దూసుకొచ్చిన టీమిండియా అభిమాని...

England fans rude behavior with KL Rahul, throws champagne corks and extra man in crease
Author
India, First Published Aug 14, 2021, 8:19 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టుకి భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. అసలే భారత బౌలర్లు, ఇంగ్లాండ్ వికెట్లు తీయడానికి తెగ కష్టపడుతూ ఉంటే... ఇంగ్లాండ్ అభిమానుల విచిత్ర ప్రవర్తన... భారత జట్టును ఇబ్బందిపెట్టింది. 

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్‌పైకి షాంపైన్ బాటిళ్ల కార్క్స్‌ విసిరాడు ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్. ఇంగ్లాండ్‌పై తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన కెఎల్ రాహుల్, రెండ టెస్టులో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అక్కసుతోనే కెఎల్ రాహుల్‌పైకి ఇలా కార్క్స్ విసిరారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్. ఈ విషయం తెలిసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... అవే కార్క్స్‌లను తీసుకుని, ఫ్యాన్స్‌కేసి విసిరి కొట్టమని సైగలతో సూచించాడు...

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఓ టీమిండియా అభిమాని, క్రీజులోకి దూసుకొచ్చాడు. 69 నెంబర్‌తో ‘జార్వో’ అని రాసి ఉన్న టీమిండియా జెర్సీ ధరించిన టీమిండియా అభిమాని... అతన్ని అడ్డుకోవడానికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బందికి బీసీసీఐ లోగోను చూపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటనతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ పగలబడి నవ్వారు... 

టీ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది ఇంగ్లాండ్. తొలి సెషన్‌లో టీమిండియాకి వికెట్లేమీ దక్కకపోయినా, రెండో సెషన్‌లో రెండు వికెట్లు దక్కాయి. జో రూట్ 237 బంతుల్లో 12 ఫోర్లతో 132 పరుగులు, మొయిన్ ఆలీ 31 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 50 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్...

Follow Us:
Download App:
  • android
  • ios