తాను అనుష్క శర్మతో మాట్లాడటం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నచ్చేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్. ఓ క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2012 భారత పర్యటన సందర్భంగా తన తొలి టెస్ట్ మ్యాచ్‌పై కాంప్టన్ స్పందించాడు.

ఈ సమయంలో కోహ్లీతో వివాదం తలెత్తిందని చెప్పాడు. తాను అతని మాజీ ప్రియురాలితో చాట్ చేసిన విషయం బయటకు పొక్కింది. ఇది కోహ్లీ దృష్టికి వెళ్లడంతో అతనికి ఏమాత్రం నచ్చలేదు.

Also Read;దాదా భయమెరుగడు: గంగూలీపై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు, ఎందుకంటే.....

తాను బ్యాటింగ్‌కు వచ్చే ప్రతీసారి విరాట్ ఏదో ఒకటి అనేవాడు. ఆమె తన ప్రేయసి అని చెప్పడానికి ప్రయత్నించేవాడని నిక్ గుర్తుచేసుకున్నాడు. ఆమె కూడా అతను తన మాజీ ప్రియుడని చెప్పేదని... ఆ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఎవరు నిజం చెబుతున్నారో అనిపించేది కాదని వ్యాఖ్యానించాడు.

ఈ విషయం కాస్తా మిగిలిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు తెలిసిందని నిక్ కాంప్టన్ చెప్పాడు. తర్వాత కోహ్లీని గ్రౌండ్‌లో రెచ్చగొట్టడానికి దాన్నొక ఉపాయంలా మార్చుకున్నామని తెలిపాడు. దీంతో కోహ్లీ ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశామని, స్పష్టం చేశాడు నిక్.

Also Read:కేఎల్ రాహుల్, స్మృతి మందాన సహా మరో ముగ్గురికి డోపింగ్ ఏజెన్సీ నోటీసులు

అయితే, అప్పుడు కోహ్లీ ప్రియురాలిగా ఉన్న మహిళ పేరును మాత్రం కాంప్టన్ వెల్లడించలేదు. కాగా విరాట్ కోహ్లీ తదనంతర కాలంలో బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అనేక సందర్భాల్లో కోహ్లీ తన భార్యపట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. ఆమె తన జీవితంలోకి వచ్చాకే స్థిరత్వం వచ్చిందని పలు సందర్భాల్లో అన్నాడు.

ఇక 2012లో ఇంగ్లాండ్‌... భారత పర్యటనకు వచ్చింది. ఇంగ్లీష్ జట్టు 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకోగా, భారత్ 3-2తో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేశాయి.