జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్...ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కీలకమైన బౌలర్లు. ఎన్నో ఏళ్ళుగా ఇంగ్లీష్ జట్టుకు సేవలు చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఎన్నోసార్లు ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు. తమ  బౌలింగ్  ప్రదర్శనతో వీరిద్దరు ఇంగ్లాండ్ అభిమానుల మనసులు దోచుకున్నారు. అయితే తాజాగా తన  అండర్సన్ తన సహచరుడు బ్రాడ్ ను మొదటిసారి కలిసినప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అండర్సన్ మొదటిసారి కలిసినప్పుడు స్టువర్ట్ బ్రాడ్ ని అమ్మాయి అనుకున్నాడట. మంచి ఫిగర్, బంగారం రంగులో మెరిసిపోయే కురులు, నీలిరంగు కళ్లతో ఈ అమ్మాయి ఎంత అందగా వుందని అనుకున్నాను.  కానీ తర్వాత తెలిసింది అమ్మాయి కాదు అబ్బాయని. ఈ ఫన్నీ సంఘటన గురించి అండర్సన్ బయటపెట్టాడు.  

అండర్సన్ క్రికెటర్ గా తన అనుభవాలు, మైదానంలో జరిగిన సంఘటనలను క్రోడికరిస్తూ బౌల్.స్టీప్.రిపీట్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలోనే బ్రాడ్ ను మొదటిసారి కలిసినప్పటి అనుభవాన్ని అంండర్సన్ గుర్తుచేసుకున్నాడు. అమ్మాయిలకు కూడా సాధ్యంకాని  అందం బ్రాడ్ సొంతమని అండర్సన్ మరోసారి తన సహచరుడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.