భారత క్రికెటర్లతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మిగిలిన విదేశీ క్రికెటర్లు... జట్టుకి పింక్ రంగు పోవడం లేదంటూ నెటిజన్లను సలహ కోరిన హేథర్ నైట్.. 

ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ సందడి కొనసాగుతోంది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌ మ్యాచులను క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్‌సీబీ క్యాంపులో హోలీ సంబరాలు జరిగాయి. భారత క్రికెటర్లు స్మృతి మంధాన, రిచా ఘోష్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీసా పెర్రీ, ఇంగ్లాండ్ క్రికెటర్ హేథర్ నైట్ తదితరులు ఈ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు...

తన టీమ్ మేట్స్‌తో కలిసి హోలీ ఆడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హేథర్ నైట్, పండగ ముగిసిన తర్వాత తన జట్టు రంగును ఎలా పొగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుందట. ‘నా జట్టుకి ఉన్న పింక్ హోలీ రంగును ఎలా పొగొట్టాలో కాస్త ఎవ్వరైనా చెప్పండి... నా ఫ్రెండ్ కోసం అడుగుతున్నా...’ అంటూ ట్వీట్ చేసింది ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్...

ఈ ట్వీట్‌కి అభిమానుల నుంచి బీభత్సమైన స్పందన వచ్చింది. ఈ ట్వీట్‌ని 24 వేల మంది లైక్ చేయగా 800 మంది రీట్వీట్ చేశారు. 730 మంది కామెంట్లు పెట్టారు. ఏకంగా 1 మిలియన్ మందికి పైగా వ్యూస్ సంపాదించిందీ ట్వీట్.. 

‘కొన్నిసార్లు జట్టుకి అంటుకున్న హోలీ రంగు పోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. నా సొంత అనుభవంతో చెబుతున్నా. నా జట్టు కూడా ఇలాగే అయ్యింది. కలర్‌ఫుల్ జట్టును ఎంజాయ్ చేయండి...’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా ‘బ్లాక్ కలర్ లేదా నీ జట్టు కలర్‌లో ఉన్న రంగు తీసుకొని రమ్మంటావా? ’ అంటూ భారత క్రికెటర్ సుష్మా వర్మ కామెంట్ చేసింది...

Scroll to load tweet…

హోలీకి ముందు జట్టుకి ఆయిల్ అంటించాలి. అప్పుడు రంగు త్వరగా పోతుంది... అంటూ మరో నెటిజన్ సలహా ఇచ్చింది. రెండు రోజుల్లో అదే పోతుంది. అప్పటిదాకా రోజుకి రెండు సార్లు తలస్నానం చేయ్యండి అంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా మరికొందరు చిట్కాలు సలహాలు పోస్ట్ చేశారు...

‘ఆలీవ్ ఆయిల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి జట్టుకి పట్టించి, ఓ అరగంట అలా వదిలేయడి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయండి... మంచి రిజల్ట్ వస్తుంది...’ అంటూ ఓ ట్విట్టర్ ఖాతాదారుడు స్పందించగా... హేథర్ నైట్ అడుగుతున్నది మరెవరి కోసమో కాదు, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఎలీసా పెర్రీ కోసమేనని ఆమె పింక్ కలర్ హెయిర్‌ని పోస్టు చేశాడు మరొకరు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్న ఎలీసా పెర్రీ, ‘ఇది నిజంగా ఇలాగే ఉండిపోతుందా? నేను రెండు సార్లు తలస్నానం చేసినా పోలేదు...’ అంటూ పింక్ కలర్ హెయిర్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎలీసా పెర్రీ... 

తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 60 పరుగుల తేడాతో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది. మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతుల్లో 11 పరుగుల తేడాతో ఓడి, వరుసగా మూడో ఓటమిని మూటకట్టుకుంది ఆర్‌సీబీ...

గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, చెత్త రికార్డు మూటకట్టుకుంది. పురుషుల ఆర్‌సీబీ టీమ్, ఐపీఎల్ 2019 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో ఓడగా, మహిళల ఆర్‌సీబీ జట్టు, తొలి సీజన్‌లోనే ఇలాంటి ఆరంభాన్ని దక్కించుకుంది.