ఒకప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, టీమిండియాతో ఆడితే సెట్ అయిపోతారు అని ఓ ట్రోలింగ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఫార్ములా శ్రీలంక విషయంలో కరెక్టుగా సరిపోతుంది. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి సరిగ్గా పరుగులు చేయలేకపోతున్న ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

గత ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 229 పరుగులు చేసిన జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో డబుల్ సెంచరీతో మోత మోగించాడు. జో రూట్‌కి టెస్టుల్లో ఇది నాలుగో డబుల్ సెంచరీ కాగా... శ్రీలంకలో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి ఇంగ్లీష్ ప్లేయర్ కూడా రికార్డు నెలకొల్పాడు.

321 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 228 పరుగులు చేసిన జో రూట్... టెస్టుల్లో 8 వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 135 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 421 పరుగుల భారీ స్కోరు చేసింది.