Asianet News TeluguAsianet News Telugu

పాక్ పై ఇంగ్లాండ్ విజయం... కానీ రికార్డు మాత్రం టీమిండియాదే బద్దలు

ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ఆతిథ్య జట్టుతో పాకిస్థాన్ ఐదు వన్డే సీరిస్ లో తలపడ్డ విషయం తెలిసిందే.  అయితే  ఈ సీరిస్ మొత్తంలొనూ ఇంగ్లాండ్ ఆధిపత్యమే కొనసాగి పాక్ అన్ని మ్యాచుల్లోనూ ఓటమిపాలయ్యింది. ఇలా ఈ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసి ప్రపంచ కప్ కు ముందు పాక్ ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. అయితే ఈ సీరిస్ లో భారత అభిమానులు ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు. మన శతృదేశం ఓవైపు ఓడిపోతుంటే ఆనందించాలో...లేక ఎన్నోఏళ్లుగా టీమిండియా  ఖాతాలో వున్న రికార్డు బద్దలవుతుంటే బాధపడాలో అర్థం కాలేదు. 

england breaks team india rare record
Author
Nottingham, First Published May 20, 2019, 5:53 PM IST

ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ఆతిథ్య జట్టుతో పాకిస్థాన్ ఐదు వన్డే సీరిస్ లో తలపడ్డ విషయం తెలిసిందే.  అయితే  ఈ సీరిస్ మొత్తంలొనూ ఇంగ్లాండ్ ఆధిపత్యమే కొనసాగి పాక్ అన్ని మ్యాచుల్లోనూ ఓటమిపాలయ్యింది. ఇలా ఈ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసి ప్రపంచ కప్ కు ముందు పాక్ ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. అయితే ఈ సీరిస్ లో భారత అభిమానులు ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు. మన శతృదేశం ఓవైపు ఓడిపోతుంటే ఆనందించాలో...లేక ఎన్నోఏళ్లుగా టీమిండియా  ఖాతాలో వున్న రికార్డు బద్దలవుతుంటే బాధపడాలో అర్థం కాలేదు. 

ఇంగ్లాండ్-పాక్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల్లో మొదటిది వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దవగా మిగతా నాలుగిట్లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఈ మొత్తం సీరిస్ పాక్ కు ఫీడకలలా మిగిలిపోతే...ఒక్క నాలుగో వన్డే మాత్రం భారత అభిమానులను కొద్దిగా బాధించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా భారత ఖాతాలో వున్న ఓ అరుదైన రికార్డును ఇంగ్లాండ్ బద్దలుగొట్టింది. 

నాలుగో వన్డేలో పాక్ బ్యాట్ మెన్స్ అద్భుతంగా రాణించడంతో 340 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అయితే ఆ తర్వాత బౌలర్లు ఈ  పరుగులను కాపాడలేక విపలమవడంతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.  అంతకుముందు జరిగిన మూడో వన్డేలో కూడా ఆతిథ్య జట్టు 359  పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇలా ఈ సీరిస్ లో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లాండ్ ఓ సరికొత్త రికార్డును సాధించింది.

గతంలో 340 కంటే ఎక్కువ పరుగుల  లక్ష్యాన్ని అత్యధిక సార్లు చేధించిన రికార్డు భారత జట్టు పేరిట వుండేది. కానీ నాలుగో వన్డే విజయంతో ఆ రికార్డును ఇంగ్లాండ్ బద్దలుగొట్టింది. ఇలా పాకిస్థాన్ ఓడిందని ఆనందపడాలో...మన జట్టు అరుదైన రికార్డు  ఇంగ్లాండ్ ఖాతాలోకి వెళ్లిందని బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిని భారత అభిమానులు ఎదుర్కొన్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios