Asianet News TeluguAsianet News Telugu

మూసుకుని బ్యాటింగ్ చెయి.. ఇంగ్లాండ్ బౌలర్ కు వార్నింగ్ ఇచ్చిన అంపైర్

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు  వరుసగా షాకులు తగులుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అతడి బౌలింగ్ ను బండకేసి బాదగా.. తాజాగా అంపైర్.. 

England Bowler Stuart Broad Told To SHUT UP by Umpire Richard Kettleborough, Video Went viral
Author
India, First Published Jul 5, 2022, 2:33 PM IST

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లీష్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కు ఏదీ అచ్చిరావడం లేదు. బౌలింగ్ లో పెద్దగా ఆకట్టుకోని బ్రాడ్ కు అంపైర్ కూడా షాకిచ్చాడు. ‘వాగింది చాలు.. మూసుకుని బ్యాటింగ్ చెయి పో..’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు  సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. 

అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడు బ్యాటింగ్ కు వచ్చేసరికి అప్పటికే  రెచ్చిపోతున్న షమీ, సిరాజ్ లు షార్ట్ డెలివరీలతో దూకుడుమీదున్నారు. 

అయితే వరుసగా షార్ట్ పిచ్ బంతులు రావడంతో బ్రాడ్ వాటిని బౌండరీకి తరలించాలని భావించినా సాధ్యం కాలేదు. అయితే వాటిని నోబాల్ గా ప్రకటించాలని కోరుతూ అంపైర్ Richard Kettleborough దగ్గరకొచ్చి అతడితో వాగ్వాదానికి దిగాడు. 

రిచర్డ్ తో బ్రాడ్.. ‘అన్నీ షార్ట్ పిచ్ బంతులే వస్తున్నాయి.. మీరు చూడట్లేదా..?’ అని ప్రశ్నించాడు. దానికి రిచర్డ్ స్పందిస్తూ.. ‘మా పని (అంపైరింగ్) ఎలా చేయాలో మాకు తెలుసు. నువ్వు నీ బ్యాటింగ్ చూసుకో. ఓకేనా..? లేకుంటే మళ్లీ నీకు ట్రబుల్ తప్పదు.  షార్ట్ పిచ్ బాల్ వచ్చింది ఓవర్ కు ఒక బంతే కదా.. ఆ విషయం మాకు తెలుసు..’ అని ఘాటు రిప్లై ఇచ్చాడు. 

 

అయితే ఆ సమయంలో బ్రాడ్..అంపైర్ ను చూస్తూ ఏదో అనుకుంటూ  క్రీజువైపుగా వెళ్తుండగా  రిచర్డ్  కల్పించుకుని.. ‘బ్రాడీ (బ్రాడ్ నిక్ నేమ్), బ్రాడీ.. నువ్వు ముందు అన్నీ మూసుకుని బ్యాటింగ్  చెయి..’ అని కౌంటరిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇదిలాఉండగా.. రిచర్డ్  వ్యాఖ్యలను ఇంగ్లాండ్ మాజీ బ్యాటింగ్ కోచ్ మార్క్ రాంప్రకాశ్ సమర్థించాడు. అతడు చాలా ధైర్యవంతుడని కొనియాడాడు. ‘బ్రాడ్ కు అతడు మంచి సలహా ఇచ్చాడు. బ్రాడ్ 6 ఫీట్ ఉంటాడు. అందుకే అతడికి  బౌలర్లు వేసిన బంతులు రిచర్డ్ కు నో బాల్ గా పరిగణించాలని అనిపించలేదేమో.. రిచర్డ్ చాలా ధైర్యవంతుడు..’ అని ప్రశంసలు కురిపించాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios