యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఇంగ్లాండ్... లీడ్స్ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించిన బెన్ స్టోక్స్ టీమ్..
తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆతిథ్య ఇంగ్లాండ్, టెస్టు సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే విజయం అందుకుంది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్, యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టి, ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1 తేడాకు తగ్గించగలిగింది..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 60.4 ఓవర్లలో 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 118 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశాడు. మార్క్ వుడ్ 5 వికెట్లు తీయగా క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 52.3 ఓవర్లలో 237 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్ 108 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేయగా జాక్ క్రావ్లే 33 పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి 6 వికెట్లు దక్కాయి.
రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా. ట్రావిస్ హెడ్ 112 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 43, మార్నస్ లబుషేన్ 33 పరుగులు చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి అవుట్ అయితే రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే పెవిలియన్ చేరాడు..
రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్‌కి 2 వికెట్లు దక్కగా స్టుర్ట్ బ్రాడ్ 3, క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 27 పరుగుల ఆధిక్యంతో కలిపి 252 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు పెట్టింది ఆస్ట్రేలియా. జాక్ క్రావ్లే 44 పరుగులు చేయగా హారీ బ్రూక్ 93 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. బెన్ డక్లెట్ 23 పరుగులు, మొయిన్ ఆలీ 5 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కాగా 21 పరుగులు చేసిన జో రూట్‌ని ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు..
బెన్ స్టోక్స్ 13, జానీ బెయిర్‌స్టో 5 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 230 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే క్రిస్ వోక్స్ 32, మార్క్ 16 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయగా ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్‌లకు చెరో వికెట్ దక్కింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు జూన్ 19 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.
మార్క్ వుడ్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో మిగిలిన రెండు టెస్టుల మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారాయి.
