Asianet News TeluguAsianet News Telugu

Moeen Ali: టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన CSK ఆల్ రౌండర్.. మోయిన్ అలీ భావోద్వేగ పోస్టు

Moeen Ali: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కమ్ బౌలర్.. టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. 

England allrounder Moeen ali retires from test cricket
Author
Hyderabad, First Published Sep 27, 2021, 2:00 PM IST

ఇంగ్లండ్ జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా పేరున్న మోయిన్ అలీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కెరీర్లో ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడిన అలీ.. సోమవారం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ వేదికగా  ప్రకటించాడు. తన రిటైర్మెంట్ గురించి అంతకుముందే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, కోచ్ లకు చెప్పానని అలీ చెప్పాడు.ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ ఆల్ రౌండర్.. 2014లో కెరీర్ ప్రారంభించాడు. ఆఫ్ స్పిన్ బౌలరైన అలీ.. తాను ఆడిన 64 టెస్టుల్లో 195 వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక బ్యాట్ తోనూ 2914 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.  టెస్టుల్లో బౌలింగ్ సగటు 36.66 కాగా బ్యాటింగ్ యావరేజీ 28.29 గా ఉంది. 

ఓపెనర్ నుంచి తొమ్మిదో నెంబర్  దాకా జట్టు అవసరాల రీత్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల అలీ.. 2016 క్యాలెండర్ ఈయర్ లో ఏకంగా 46.86 సగటుతో 1078 పరుగులు చేయడం గమనార్హం. 2017-19 మధ్య అతడు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఓవల్ లో హ్యాట్రిక్ సాధించాడు. కాగా 2019 యాషెస్ సిరీస్ తర్వాత అలీ పెద్దగా టెస్టు క్రికెట్ లో కనిపించలేదు. ఇటీవల ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్ లో మళ్లీ చోటు సంపాదించుకున్న అలీ.. పెద్దగా ఆకట్టుకోలేదు.

 

రిటైర్మెంట్ సందర్భంగా అలీ ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన సహచర ఆటగాళ్లకు, బోర్డుకు థ్యాంక్స్ చెప్పాడు. తనకు ఇప్పుడు 34 ఏండ్లని మరింత కాలం క్రికెట్ ను ఆస్వాధించడానికే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios