ENG vs SA T20I: టెస్టులలో అదరగొడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం వరుస సిరీస్ లలో ఓడుతూ పరువు పోగొట్టుకుంటున్నది. 

ఇటీవలే టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. తాజాగా ప్రత్యర్థి మారినా ఆ జట్టు కథ మాత్రం మారలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను 1-1తో సమం (వర్షం వల్ల మూడో వన్డే రద్దైంది) చేసుకున్న ఇంగ్లాండ్.. టీ20లలో సఫారీల చేతిలో ఓడి మరో సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం రాత్రి ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20లో.. బట్లర్ గ్యాంగ్ 90 పరుగుల తేడాతో ఓడింది. సఫారీ స్పిన్నర్ షంషీ స్పిన్ మాయాజాలానికి ఇంగ్లాండ్ దాసోహమైంది. 

సౌతాంప్టన్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఓపెనర్ డికాక్ (0) డకౌటైనా హెన్రిక్స్ (50 బంతుల్లో 70, 9 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 51, 5 ఫోర్లు) ధాటిగా ఆడాదరు. 

వీరితో పాటు రూసో (18 బంతుల్లో 31, 6 ఫోర్లు) డేవిడ్ మిల్లర్ (9 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్) లు రెచ్చిపోయి ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు స్పిన్నర్ షంషీ చుక్కలు చూపించాడు ఓపెనర్లు జేసన్ రాయ్ (17), జోస్ బట్లర్ (14) లతో పాటు డేవిడ్ మలన్ (7) కూడా విఫలమయ్యారు. ఈ క్రమంలో జానీ బెయిర్ స్టో (27) ఆదుకునే ప్రయత్నం చేసినా అతడిని కేశవ్ మహారాజ్ ఔట్ చేశాడు. 

Scroll to load tweet…

మోయిన్ అలీ (3) ని మార్క్రమ్ పెవిలియన్ కు పంపాడు. ఇక అప్పుడు మొదలైంది షంషీ స్పిన్ మాయజాలం. లియామ్ లివింగ్ స్టోన్ (3) మొదలుకుని తర్వాత వచ్చిన సామ్ కరన్ (9), డేవిడ్ విల్లీ (0), క్రిస్ జోర్డాన్ (14), అదిల్ రషీద్ (0) లు షంషీ స్పిన్ కు దాసోహమయ్యారు. 

ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి టీ20ని ఇంగ్లాండ్ నెగ్గగా.. రెండో మ్యాచ్ ను సఫారీలు గెలిచారు. నిర్ణయాత్మక మూడో టీ20లో కూడా సఫారీలు నెగ్గారు. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు.. ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

Scroll to load tweet…