Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల క్రితమే రిషబ్ పంత్‌ని స్పీడ్ తగ్గించుకోమని చెప్పిన శిఖర్ ధావన్... పాత వీడియో వైరల్...

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వీడియోలో రిషబ్ పంత్‌కి ‘మెల్లిగా నడపమని’ సలహా ఇచ్చిన శిఖర్ ధావన్... కారు ప్రమాదం తర్వాత వీడియో వైరల్.. 

Drive Carefully, Shikhar Dhawan old advice to Rishabh Pant video goes viral after accident
Author
First Published Dec 31, 2022, 10:07 AM IST

అతివేగం కారణంగా ఎన్నో జీవితాలు తారుమారైపోయాయి. ఎంత ఎక్కువ స్పీడ్‌తో దూసుకెళితే అంత కిక్కు వస్తుందని భావించే నేటి యువత, అర్ధాంతరంగా తమ జీవితాలను అతలాకుతలం చేసుకుంటున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ పరిస్థితికి కూడా అతి వేగమే కారణం...

అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి బయలుదేరిన రిషబ్ పంత్, తన బీఎండబ్ల్యూ కారులో అతి వేగంగా దూసుకెళ్తూ అర సెకను పాటు కునుకు తీయడంతో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న కారు, డివైడర్‌ని బలంగా ఢీకొట్టడంతో రిషబ్ పంత్‌ తీవ్ర గాయాలయ్యాయి. 

కారు మంటల్లో కాలి బూడిదైన పరిస్థితి చూసిన తర్వాత రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడడమే చాలా పెద్ద విషయంగా చెబుతున్నారు నెటిజన్లు. అంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా రిషబ్ పంత్ గాయాలతో తప్పించుకున్నాడనే అతనికి అదృష్టంతో పాటు అభిమానుల ఆశీసులు తోడు ఉండమేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు...

రిషబ్ పంత్ కారు స్పీడ్ గురించి భారత క్రికటెర్ శిఖర్ ధావన్ చేసిన పాత కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శిఖర్ ధావన్, ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్స్‌లో సభ్యుడిగా ఉన్న సమయంలో రిషబ్ పంత్ ఓ చిన్న ఇంటర్వ్యూ చేశాడు...

ఆ సమయంలో ‘నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా?’ అంటూ శిఖర్ ధావన్‌ని ప్రశ్నించాడు రిషబ్ పంత్. దానికి శిఖర్ ధావన్ వెంటనే ‘బండి.. కాస్త మెల్లిగా నడుపు’ అంటూ సూచించాడు. దానికి రిషబ్.. ‘సరే, నేను మీ సలహా తీసుకుంటున్నాను. బండి మెల్లిగా నడుపుతాను’ అంటూ సమాధానం ఇచ్చాడు...

మూడేళ్ల క్రితం పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ వేగంగా కారు డ్రైవ్ చేస్తాడని తెలిసిన శిఖర్ ధావన్, అప్పుడే అతన్ని హెచ్చరించాడని అయితే మనోడు ఉడుకురక్తంతో దాన్ని పట్టించుకోలేదని అంటున్నారు నెటిజన్లు...

రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్‌లో గాయపడిన తర్వాత శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. ‘ప్రాణాలతో బయటపడేసినందుకు థ్యాంక్స్ గాడ్.. నువ్వు త్వరగా కోలుకోవడానికి దేవుడిని కోరుకుంటున్నా..  ’ అంటూ ట్వీట్ చేశాడు గబ్బర్.

2019 నుంచి 2021 వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన శిఖర్ ధావన్, 2020 సీజన్‌లో వరుస మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే మెగా వేలంలో అతన్ని అట్టిపెట్టుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్. మెగా వేలంలో శిఖర్ ధావన్‌ని కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, 2023 సీజన్‌లో టీమ్‌ని నడిపించే బాధ్యత కూడా అప్పగించింది...

యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2023 సీజన్‌కి అందుబాటులో ఉండడం అనుమానమే అంటున్నారు నెటిజన్లు. కనీసం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సమయానికైనా రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటాడా? అనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది...

Follow Us:
Download App:
  • android
  • ios