T20I World Cup Squad: టీ20 ప్రపంచకప్  కోసం భారత జట్టు  సోమవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు. 

వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం సాయంత్రం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో ఇటీవల ఆసియా కప్ లో పాల్గొన్న సభ్యులే ఉన్నారు. అయితే ఈ జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు అవకాశం దక్కడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో అతడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. 

2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ లో భారత జట్టులో సభ్యుడైన కార్తీక్.. 2019 లో చివరిసారిగా ఐసీసీ టోర్నీ ఆడాడు. అంతకుముందు పురుషుల టీ20 ప్రపంచకప్ -2010లో అతడు భారత జట్టు తరఫున ఎంపికయ్యాడు. 

ఆ తర్వాత భారత జట్టులోకి అడపాదడపా వచ్చి వెళ్లాడే తప్ప ఐసీసీ టోర్నీలలో గానీ మిగతా సిరీస్ లలో గానీ ఆడింది లేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత కార్తీక్ జట్టు నుంచి దాదాపు తప్పుకున్నాడనే అనుకున్నారంతా. కొద్దికాలం దినేశ్ కార్తీక్.. సునీల్ గవాస్కర్ తో కలిసి కామెంట్రీ కూడా చేశాడు. దీంతో కార్తీక్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టే అనుకున్నారంతా. కానీ గతేడాది దేశవాళీతో పాటు ఈ ఏడాది ఐపీఎల్ లో దినేశ్ కార్తీక్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు. దీంతో కార్తీక్.. ఈ ఏడాది స్వదేశంలో సౌతాఫ్రికా తో జరిగిన టీ20 సిరీస్ కు ఎంట్రీ ఇచ్చాడు.

Scroll to load tweet…

ఆ తర్వాత ఇండియా ఆడిన దాదాపు ప్రతీ సిరీస్ లోనూ కార్తీక్ ఎంపికవుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో కూడా కార్తీక్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో ఆడాడు. అయితే ఆ తర్వాత జట్టులో లెఫ్ట్ హ్యాండర్ల కొరతతో మరో వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు అవకాశమివ్వడంతో కార్తీక్ బెంచ్ కే పరిమితమయ్యాడు. 

తాజాగా టీ20 ప్రపంచకప్ కు విడుదల చేసిన జట్టులో కార్తీక్ పేరు కూడా ఉంది. దీంతో ట్విటర్ వేదికగా కార్తీక్.. ‘డ్రీమ్స్ డూ కమ్ ట్రూ’ అని ట్వీట్ చేశాడు. ఆరు నెలల క్రితం ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు కార్తీక్.. ఓ ఇంటర్వ్యూలో ‘వచ్చే టీ20 ప్రపంచకప్ లో ఆడటం నా కల’అని తెలిపాడు. ఆ మేరకే కార్తీక్.. పొట్టి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన కలను నిజం చేసుకోబోతున్నాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…