అందరి కన్నా ఎక్కువ వికెట్లు తీయడమే తన ముందు ఉన్న అతి పెద్ద డ్రీమ్ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. రేపటి నుంచి ఐపీఎల్ సందడి మొదలవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా.. సిరాజ్ ఆర్సీబీ నుంచి  ఓపెనర్ గా దిగనున్నాడు. కాగా.. ఆర్సీబీ తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో తలపడనున్నది. ఈ నేపథ్యంలో.. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

తాను అందరికన్నా ఎక్కువ వికెట్లు తీయాలని అనుకుంటున్నానని.. అదే తన ముందు ఉన్న అతి పెద్ద డ్రీమ్ అని సిరాజ్ పేర్కొన్నాడు. కాగా.. రేపు జరగనున్న మ్యాచ్ లో.. తన మెంటార్ జస్ప్రీత్ బుమ్రాతో సిరాజ్ తలపడనున్నాడు. ఈ విషయం పై కూడా సిరాజ్ స్పందించాడు.

 

తాను బౌలింగ్ చేస్తున్న్ సమయంలో బుమ్రా తన పక్కనే ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా తనకు చాలా విషయాలను నేర్పించాడని చెప్పాడు. తాను ఇషాంత్ శర్మతో కలిసి ఆడానని.. అలాంటివారితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాల గొప్పగా అనిపిస్తుందని చెప్పాడు. అందరికన్నా.. టీమిండియా నుంచి ఎక్కువ వికెట్లు తీయాలనే కోరిక తనకు ఉందని.. అందు కోసం కష్టపడుతున్నట్లు చెప్పాడు. కాగా.. ఈ వీడియోని ఆర్సీబీ తన ట్విట్టర్ లో పోస్టు చేసింది.