Asianet News TeluguAsianet News Telugu

ఇదేం ఫార్మాట్.. తలా తోకా లేకుండా ఉంది.. విజయ్ హజారే ట్రోఫీపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్

Vijay Hazare Trophy: కొద్దిరోజులుగా జరుగుతున్న దేశవాళీ  లిస్ట్ ఏ ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్‌టీ)పై  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇదేం ఫార్మాట్ అంటూ.. 

Does It Make any Sense: Dinesh Karthik Questions Vijay Hazare Format
Author
First Published Nov 21, 2022, 5:58 PM IST

దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ  ఫార్మాట్ పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్  కార్తీక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  తమిళనాడు వంటి ఎలైట్ హోదా ఉన్న జట్టుతో అనామక అరుణాచల్ ప్రదేశ్ ఆడటమేంటని ప్రశ్నించాడు.  టోర్నీ నిర్వహణ తీరుపై నిర్వాహకుల (బీసీసీఐ) పై ప్రశ్నల వర్షం కురిపించాడు. వీహెచ్‌టీలో భాగంగా  మంగళవారం తమిళనాడు - అరుణాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం   ట్విటర్ వేదికగా  స్పందిస్తూ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో  తమిళనాడు ఘన విజయం సాధించిన అనంతరం   కార్తీక్ స్పందిస్తూ.. ‘వరల్డ్ రికార్డ్ అలర్ట్.. జగదీశన్-సాయి సుదర్శన్  గొప్ప ప్రదర్శన చేశారు. మీ ఆట చాలా ఆనందం కలిగించింది.  ఈ ఓపెనింగ్ జోడీ  అద్భుతాలు చేస్తున్నది.  వెల్ డన్ బాయ్స్..’ అని జట్టును ప్రశంసల్లో ముంచెత్తాడు. 

 

ఆ తర్వాత మరో ట్వీట్ లో.. ‘అసలు  ఎలైట్ లిస్ట్ లో ఉన్న జట్లతో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు లీగ్ దశలో పోటీ పడటం ఏమైనా సెన్స్ ఉందా..?  ఇది ఎలైట్ జట్ల రన్ రేట్లను మార్చివేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి  మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తే  పరిస్థితిని ఒకసారి ఊహించండి.. ఎలౌట్ గ్రూప్ లో లేని జట్లను  సెపరేట్ గ్రూప్ గా చేసి వాటితో క్వాలిఫై  ఆడించలేరా..?’ అని  ప్రశ్నలు సంధించాడు. 

 

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జట్లను 5 గ్రూపుల్లో విభజించారు.  

- ఎలైట్ గ్రూప్ - ఏలో  సౌరాష్ట్ర, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, మణిపూర్ ఉన్నాయి.

- ఎలైట్ గ్రూప్ - బీలో కర్నాటక, అసోం, జార్ఖండ్, ఢిల్లీ,  రాజస్తాన్, విదర్భ,  మేఘాలయా,  సిక్కీం ఉన్నాయి.

- ఎలైట్ గ్రూప్-సీలో  తమిళనాడు, ఆంధ్రా, హర్యానా, కేరళ, గోవా, ఛత్తీస్‌గఢ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్

- ఎలైట్ గ్రూప్ - డీలో పంజాబ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, బరోడా, మధ్యప్రదేశ్, ఒడిషా, నాగాలాండ్ ఉన్నాయి.

- ఎలైట్ గ్రూప్ - ఈ లో  మహారాష్ట్ర, రైల్వేస్, బెంగాల్, ముంబై, పుదుచ్చేరి,  సర్వీసెస్, మిజోరాం ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios