క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఏర్ప‌డిన లాక్‌డౌన్‌ను టీమ్ఇండియా క్రికెట‌ర్లు చక్క‌గా వాడుకుంటున్నారు. త‌మ‌కు దొరికిన ఈ విలువైన స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో సర‌దాగా గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు వైవిధ్య‌మైన ఆలోచ‌న‌ల‌తో కొత్త కొత్త స‌వాళ్ల‌తో స‌హ‌చ‌రుల‌ను ఇందులో భాగం చేస్తున్నారు. 

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ..ట్రిమ్ ఎట్ హోమ్ చాలెంజ్‌ను మొద‌లుపెట్టాడు.మొన్నటికి మొన్న భార్య అనుష్క శర్మతో హెయిర్ కట్ చేయించుకున్నాడు. అతనిని ఆదర్శంగా తీసుకొని  చాలా మంది భార్యలతో హెయిర్ కట్ చేయించుకున్నారు. తాజాగా.. ట్రిమ్ ఛాలెంజ్ మొదలుపెట్టాడు.

 లాక్‌డౌన్‌తో ఇంటికి ప‌రిమిత‌మైన కోహ్లీ..తన ట్రేడ్‌మార్క్ గ‌డ్డాన్నిట్రిమ్ చేసుకుని కొత్త స్టైల్‌లో క‌నిపించాడు. ఈ వీడియోను అభిమానుల కోసం ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఓ సందేశం రాసుకొచ్చాడు. 

‘ మ‌నం ఇంట్లో సౌక‌ర్యంగా ఉండేట‌ట్లు చూసుకోవ‌డం మొద‌టి ప్రాధాన్యంగా ఉంచుకోవాలి. అందుకే గ‌డ్డం తీసేసి కొత్త లుక్‌లో క‌నిపించాల‌నుకున్నాను. అందుకే ఇది ఎంచుకున్నాను. నాలాగే ఇంట్లో ఉంటూ ట్రిమ్ చాలెంజ్‌ను స్వీక‌రించి న్యూ లుక్‌తో వీడియో పోస్ట్ చేయండి’ అని కోహ్లీ సందేశ‌మిచ్చాడు.

అయితే... కోహ్లీ చేసిన ఈ వీడియోని చూసిన ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్రోల్ చేశాడు. కోహ్లీ చేసిన ఛాలెంజ్ స్వీకరించకపోగా.. అతని గడ్డంపై జోక్స్ వేశాడు. తెల్ల జుట్టు పోగొట్టుకోవడం ఎలాగో చెప్పవా అంటూ కామెంట్ చేశాడు.

కోహ్లీ వయసు 30ఏళ్లు అయినా.. అతని గడ్డంలో అప్పుడే తెల్ల వెంట్రుకలు కనపడుతున్నాయి. దానిని టార్గెట్ చేసిన పీటర్సన్.. తెల్లజుట్టుకి పొగొట్టుకోవడానికి టిప్  చెప్పవా అంటూ అడుగుతూ ట్రోల్ చేశాడు. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.