కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మాములగా అయితే.. ఈ టైంలో ఐపీఎల్ తో క్రికెటర్లంతా సందడి చేసేవారు. అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోయి  చూసేవారు.

కానీ కరోనా కారణంగా అంతా తారుమారు అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి తోచినట్లుగా వారు టైంపాస్ చేస్తున్నారు. కాగా.. లాక్‌డౌన్‌ రూపంలో ఊహించని విరామాన్ని కోహ్లి తన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు విరుష్కలు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I spotted .... A Dinosaur on the loose 🦖🦖🦖🤪🤪🤪

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on May 19, 2020 at 11:57pm PDT

 

రెండు రోజుల క్రితం ఫిట్నెస్ వీడియో షేర్ చేసిన కోహ్లీ.. తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో కోహ్లీ చాలా ఫన్నీగా కనిపించారు. డైనోసర్‌లగా కోహ్లి నడుస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నేను డైనోసర్‌ను గుర్తించాను’ అంటూ కామెంట్‌ జతచేసింది. 

ఇక ఈ వీడియోకు కోహ్లి ఫ్యాన్స్‌ తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ‘కోహ్లి అచ్చం డైనోసర్‌లా నడిచావ్‌’ అని ఓ అభిమాని సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక అంతకుముందు జిమ్‌లో కోహ్లి వర్కౌట్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.