Asianet News TeluguAsianet News Telugu

దినేశ్ కార్తిక్ టీంమెంబర్స్‌పై ఎందుకు కోప్పడ్డాడంటే...

అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపిఎల్ లో కూడా కూల్ కెప్టెన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు మహేంద్ర సింగ్ ధోని. అయితే ధోనినే పాలో అవుతూ అతడి మాదిరిగానే మ్యాచ్ ఫినిషర్, వికెట్ కీపర్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు దినేశ్ కార్తిక్. దీంతో ఐపిఎల్ లో కూడా అతడు అదే ఫార్ములా ఉపయోగించాడు. కోల్‌కతా జట్టుకు సారథ్యం వహిస్తున్న కార్తిక్ ఎలాంటి ఒత్తిడిని దరికి చేరనివ్వకుండా ధోని లాగే కెప్టెన్ కూల్ అన్న పేరు తెచ్చుకున్నాడు. కానీ శుక్రవారం కింగ్స్ లెవెన్ తో మ్యాచ్ సందర్భంగా టీంమెంబర్స్ పై కార్తిక్ మైదానంలోనే భాహాటంగా తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడిలో కెప్టెన్ కూల్ మాత్రమే కాదు యాంగ్రీ కెప్టెన్ కూడా దాగున్నాడని తెలిసింది.  

Dinesh Karthik reveals why he was angry with KKR teammates
Author
Mohali, First Published May 4, 2019, 8:56 PM IST

అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపిఎల్ లో కూడా కూల్ కెప్టెన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు మహేంద్ర సింగ్ ధోని. అయితే ధోనినే పాలో అవుతూ అతడి మాదిరిగానే మ్యాచ్ ఫినిషర్, వికెట్ కీపర్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు దినేశ్ కార్తిక్. దీంతో ఐపిఎల్ లో కూడా అతడు అదే ఫార్ములా ఉపయోగించాడు. కోల్‌కతా జట్టుకు సారథ్యం వహిస్తున్న కార్తిక్ ఎలాంటి ఒత్తిడిని దరికి చేరనివ్వకుండా ధోని లాగే కెప్టెన్ కూల్ అన్న పేరు తెచ్చుకున్నాడు. కానీ శుక్రవారం కింగ్స్ లెవెన్ తో మ్యాచ్ సందర్భంగా టీంమెంబర్స్ పై కార్తిక్ మైదానంలోనే భాహాటంగా తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడిలో కెప్టెన్ కూల్ మాత్రమే కాదు యాంగ్రీ కెప్టెన్ కూడా దాగున్నాడని తెలిసింది.  

ప్లేఆఫ్‌ బెర్త్‌ కోసం గెలుపు అత్యంత కీలకమైన నేపథ్యంలో కోల్‌కతా సారథిగా దినేశ్‌ కార్తీక్‌ కొంచెం టఫ్‌గా వ్యవహరించాడు. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జట్టు  సభ్యులందరిని పిలిచి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడాడు. కార్తీక్‌ తన తన సహచరులతో ఏం మాట్లాడాడన్నది వినపడకున్నా...అతడి హావభావాలను బట్టి, ముఖకవలికలను బట్టి ఎదో స్ట్రాంగ్ గానే చెబుతున్నట్లు తెలసింది. కెప్టెన్ మాట్లాడుతున్న సమయంలో ఆటగాళ్లు  కూడా గంభీరంగా వుండటంతో అతడు గట్టిగానే వారిని మందలిస్తున్నట్లు అర్థమయ్యింది.

అయితే ఎప్పుడూ కూల్ గా వుండే కార్తిక్ కు అంతలా కోపం ఎందుకు వచ్చిందో మ్యాచ్ అనంతరం అతడి మాటలను గమనిస్తే అర్థమవుతుంది.  మ్యాచ్ ముగిసిన తర్వాత కార్తిక్ మాట్లాడుతూ ఈ విజయంపై తానంత సంతృప్తిగా లేనని  అన్నాడు.  ముఖ్యంగా తమ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు నన్నెంతో నిరాశకు గురిచేస్తున్నాయని వెల్లడించాడు. దీంతో అతడి మైదానంలో ఎవరిని ఉద్దేశించి కోప్పాడ్డాడో చెప్పకున్నా ఆ మ్యాచ్ ను ఫాలో అయిన అభిమానులకు అర్థమైపోతుంది. 

మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతాకు సందీప్ వారియర్ మంచి ఆరంభాన్నిచ్చాడు. మంచి ఫామ్ లో వున్న కెఎల్ రాహుల్, గేల్ వంటి విద్వంసకర ఓపెనర్లను తొందరగానే  ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత కోల్ కతా ఫీల్డింగ్ తో పాట బౌలింగ్ గాడి తప్పింది. సునీల్ నరైన్ రెండు సందర్భాల్లో మిస్ ఫీల్డ్ చేసాడు. అంతేకాకుండా దాటిగా ఆడుతున్న రాజస్థాన్ బ్యాట్ మెన్స్ ని కెకెఆర్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. దీంతో భావోద్వేగాన్ని అణచుకోలేకపోయిన కార్తిక్ దాన్ని బయటపెట్టుకున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios