Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్-పాక్ మ్యాచ్ లో ధోని స్టైల్... రషీద్ పై భారత అభిమానుల ప్రశంసలు (వీడియో)

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ లో చెత్త ప్రదర్శన చేసి పాక్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పాక్ చెత్తగా ఆడింది అనే బదులు ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడిందని చెప్పాలి. ఇలా సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ కు ముందు అదిరిపోయే ప్రదర్శన చేసింది. అయితే ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ ఓ అద్భుతమైన రనౌట్‌తో భారత అభిమానుల మనసులు దోచేసుకున్నాడు. ఇంతకీ పాక్ బ్యాట్ మెన్ ని ఇంగ్లాండ్ బౌలర్ ఔట్ చేస్తు భారత అభిమానులకు నచ్చడం ఏంటని  ఆశ్చర్యపోతున్నారా...? అయితే ఈ కింది స్టోరీ చదవండి. 

dhoni style runout in eng vs pak match
Author
England, First Published May 20, 2019, 4:09 PM IST

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ లో చెత్త ప్రదర్శన చేసి పాక్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పాక్ చెత్తగా ఆడింది అనే బదులు ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడిందని చెప్పాలి. ఇలా సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ కు ముందు అదిరిపోయే ప్రదర్శన చేసింది. అయితే ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ ఓ అద్భుతమైన రనౌట్‌తో భారత అభిమానుల మనసులు దోచేసుకున్నాడు. ఇంతకీ పాక్ బ్యాట్ మెన్ ని ఇంగ్లాండ్ బౌలర్ ఔట్ చేస్తు భారత అభిమానులకు నచ్చడం ఏంటని  ఆశ్చర్యపోతున్నారా...? అయితే ఈ కింది స్టోరీ చదవండి. 

ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న వన్డేల సీరిస్ లో మొదటి మ్యాచ్ రద్దవగా మిగతా వాటిల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ వరుసగా విజయాలను అందుకుంది. ఇలా మొదటి మూడు వన్డేల్లోనే పాక్ సీరిస్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే ఆదివారం నామమాత్రంగా జరిగిన మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకుని వరల్డ్  కప్ టోర్నీలోకి కాస్త కాన్పిడెంట్ గా అడుగుపెట్టాలని భావించింది. అయితే ఆ  ఆశలపై ఈసారి ఇంగ్లీష్ బౌలర్లు నీళ్లు చల్లారు. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ కు దిగి 351 పరుగులు చేసింది. దీంతో 352 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన పాక్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లిద్దరు తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో బాబర్ ఆజమ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడు 80 పరుగుల చేసి సెంచరీదిశగా సాగుతున్న సమయంలో రషీద్ చేతిలో రనౌట్ కు గురై పెవిలియన్ కు చేరాడు. 

ఆదిల్ రషీద్ వేసిన 27 ఓవర్లో ఓ అద్భుతం జరిగింది. సర్ఫరాజ్‌ బ్యాటింగ్ చేస్తుండగా బాబర్‌ అవతలి ఎండ్ లో వున్నాడు. అయితే సర్ఫరాజ్ ఓ బంతిని డిపెన్స్ ఆడి సింగ్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ ఇంగ్లాండ్ వికెట్ కీఫర్ ఆ బంతిని అందుకోగా అప్రమత్తమయిన కెప్టెన్ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే సగం క్రీజులోకి వచ్చిన బాబర్ కూడా వెనక్కి పరుగెత్తాడు. ఈ క్రమంలోనే కీపర్ బట్లర్ బంతిని ఆదిల్ కు అందించాడు. దీన్ని అందుకున్న అతడు స్టంప్స్‌ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో బాబర్ రనౌటయ్యాడు. 
 
మన దాయాది జట్టు ఓటమికి కారణమైన ఈ రనౌట్ అచ్చం ధోని స్టైల్లో వుండటంతో భారత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగా అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు. ''ధోనీ స్టైల్ ను వేరే జట్టు ఆటగాడు ఫాలో అయి పాకిస్థాన్ నడ్డి  విరిస్తే...ప్రపంచ కప్ లో వారు స్వయంగా ధోనిని ఎదుర్కోవాల్సి వుంటుంది...పాపం వారి పరిస్థితి ఆలోచిస్తేనే జాలేస్తోంది'' అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios