ఐపిఎల్ సీజన్ 12 ఆరంభ మ్యాచ్ నుండి ఓటమన్నదే లేకుండా సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు బుధవారం బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్  చేతిలో సీఎస్‌కే ఘోర పరాభవాన్ని చవిచూసింది. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో విఫలమైన సీఎస్కే ఆటగాళ్లపై  కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సీరియస్ అయ్యారు. 

ముంబై జట్టు ఆటగాళ్లు బాగా ఆడారని అనేకంటే తాము చెత్తగా ఆడటం వల్లే ఓటమిపాలయ్యామని ధోని అన్నారు. మొదట తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినా సెంకడాఫ్ లో లయ తప్పారని పేర్కొన్నారు. అందువల్లే భారీగా పరుగులు సమర్పించుకుున్నామని...అదే విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. డెత్ ఓవర్లలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా వుండేదని అన్నారు. 

ఇలా బౌలింగ్, ఫీల్డింగ్ లో విఫలమవడంతో పాటు  లక్ష్య చేధనలో బ్యాట్ మెన్స్ కూడా రాణించకపోవడంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా బౌలర్లు పూర్తిగా విఫలమవడం ఈ సీజన్లో మొదటి ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. 

ఇక తమ జట్టును వేధిస్తున్న మరో సమస్య గాయాలని ధోని పేర్కొన్నారు. విదేశీ ఆటగాడు డేవిడ్ విల్లీ గాయం కారణంగా జట్టుకు దూరమవగా...బ్రావో గాయంతో బాధపడుతూనే ఆడుతున్నాడన్నారు. వీరి గాయాల ప్రభావం ముంబై ఇండియన్స్ తో వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో స్పష్టంగా బయటపడిందన్నారు.

ముంబై జట్టు చేతిలో ఓడిపోవడం వల్ల తమ జట్టులో ఎక్కడ లోపాలున్నాయో భయటపడిందని అన్నాడు. కాబట్టి వచ్చే మ్యాచ్ లో కొన్ని మార్పులతో బరిలోకి దిగుతామని...అలాగే ఆటగాళ్ల కాంబినేషన్ ను కూడా మారుస్తామని ధోనీ పేర్కొన్నాడు.