విశాఖపట్నం: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ 2019 ఫైనల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఐపిఎల్ లో మూడు సార్లు టైటిల్ గెలుచుకుని చెన్నై సూపర్ కింగ్స్ ముంబై తర్వాతి స్థానాన్ని అక్రమించింది. ఈ స్థితిలో ధోనీ వచ్చే ఏడాది ఐపిఎల్ ఆడుతాడా ప్రశ్న అందరి మెదళ్లనూ తొలుస్తోంది. 

అదే ప్రశ్న సిమన్ డౌల్ ధోనీకి వేశాడు. "ఔను, ఆశిస్తున్నా*  అని ధోనీ అన్నాడు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆయన ఆ విధంగా అన్నాడు. తమ జట్టుకు ఇది మంచి సీజన్ అని, తాము ఫైనల్స్ కు ఎలా చేరుకున్నామనేది తిరిగి చూసుకోవాల్సి ఉందని ధోనీ అన్నాడు. గతంలో కన్నా తాము గొప్పగా ఏమీ ఆడలేదని అన్నాడు.

మిడిల్ ఆర్డర్ బాగా లేదని అన్నాడు. ఇప్పుడు ప్రపంచ కప్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాతనే గ్యాప్స్ గురించి దృష్టి పెట్టాల్సి వస్తుందని అన్నాడు. బౌలర్ల సమస్య లేదని, బ్యాట్స్ మెన్ బాగా ఆడాల్సి ఉండిందని అన్నాడు.