మహేంద్ర సింట్ ధోని ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసు. టీమిండియాలో తరపున ఆడిన, ఐపిఎల్లో ఆడినా అతడి ఆటంటే ప్రతి  ఒక్కరు పడి చస్తుంటారు. ముఖ్యంగా అతడి ధనాధన్ షాట్లకు, కళ్లు చెదిరే స్టంపింగ్ లకు ఫిదా కాని అభిమాని వుండడంటే అతిశయోక్తి వుండదు. ఇలా గొప్ప ఆటగాడిగా పేరుతెచ్చుకున్న తర్వాత కూడా ధోని తన మూలాలను మరిచిపోలేదు. తాను ఎంత సాధారణ స్థాయినుండి వచ్చాడో ఎల్లపుడూ గుర్తుంచుకుని ప్రదర్శించే సింప్లిసిటీతో కూడా అభిమానుల మనసులు దోచుకుంటుంటాడు. అలా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న ధోని అభిమానులకు మనసుకు మరింత దగ్గరయ్యాడు. 

బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానంలో చివరి లీగ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ను కూడా గెలుచుకున్న ధోని చెన్నై అభిమానులతో తన అనుబంధాన్ని గురించి మాట్లాడాడు. తమకు మద్దతుగా నిలిచిన తమిళ ప్రజలకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఇదే సమయంలో చెపాక్ స్టేడియాన్ని మ్యాచుల నిర్వహణకోసం తీర్చిదిద్దిన గ్రౌండ్ సిబ్బందిని ఆయన ప్రశంసించాడు. కేవలం ప్రశంసలతో సరిపెట్టకుండా వారితో ఫోటో దిగి తన గొప్ప మనసును చాటుకున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి దానికి ధోనితో కలిసి గ్రౌండ్ సిబ్బంది దిగిన ఫోటోను జత చేసింది. 

''సూపర్ మ్యాన్ 'తాల(ధోని)' వారు లేకుండా ఏమీ చేయలేరు.  వారు లేకుండా ఈ సీజన్ జరగడమే సాధ్యం కాదు'' అంటూ గ్రౌండ్ సిబ్బందిన ఉద్దేశించి సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది.  

అసలు గుర్తింపు కోరుకోకుండా మైదానాన్ని తయారుచేసే సిబ్బందిని కెమెరా ముందుకు తీసుకువచ్చిన ధోని పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆటగాళ్ల పలకరింపుకు కూడబా నోచుకోని వారికి ధోని  ఇచ్చిన గౌరవం, ఆప్యాయంగా పలకరించిన విధానం అద్భుతమంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మా మనసుల్లో నిలిచిన ధోని  స్థాయి ఈ సంఘటనతో మరింత పైకి వెళ్లిందని అభిమానులు అంటున్నారు. ఇలాంటి గొప్ప మనసు, గొప్ప ఆలోచనలు వున్నాయి కాబట్టే ధోని గొప్ప క్రికెటర్ గా ఎదిగాడంటూ అభిమానులు అతన్ని కొనియాడుతున్నారు.