Asianet News TeluguAsianet News Telugu

ధోని గ్యారేజ్ లోకి మరో బైక్...ప్రత్యేకత ఏంటో తెలుసా?

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ తర్వాత అత్యధికంగా ఇష్టపడేది బైక్స్ నే  అన్న విషయం అభిమానులందరికి  తెలిసిందే. ఈ ఇష్టంతోనే అతడు ఎక్కడ కొత్త మోడల్ వాహనాలు కనిపించినా వదిలిపెట్టడు. ఇలా సేకరించిన వాహనాల కోసమే కోసమే తన ఇంట్లో ఓ ప్రత్యేక గ్యారేజిని ఏర్పాటు చేసి సమయం దొరికినప్పుడల్లా వాటిపై రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. అంతేకాదు  అప్పుడప్పుడు వాటిని అతడే స్వయంగా శుభ్రం చేసుకోడాన్ని బట్టే బైకులంటే అతడికెంత ప్రేమో తెలుస్తుంది. ఇలా ధోని గ్యారెజ్ లోకి మరో స్పెషల్ బైక్ చేరింది. 
 
Dhoni Brings Home The 2019 TVS Apache RR 310
Author
Hyderabad, First Published May 29, 2019, 5:39 PM IST

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ తర్వాత అత్యధికంగా ఇష్టపడేది బైక్స్ నే  అన్న విషయం అభిమానులందరికి  తెలిసిందే. ఈ ఇష్టంతోనే అతడు ఎక్కడ కొత్త మోడల్ వాహనాలు కనిపించినా వదిలిపెట్టడు. ఇలా సేకరించిన వాహనాల కోసమే కోసమే తన ఇంట్లో ఓ ప్రత్యేక గ్యారేజిని ఏర్పాటు చేసి సమయం దొరికినప్పుడల్లా వాటిపై రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. అంతేకాదు  అప్పుడప్పుడు వాటిని అతడే స్వయంగా శుభ్రం చేసుకోడాన్ని బట్టే బైకులంటే అతడికెంత ప్రేమో తెలుస్తుంది. ఇలా ధోని గ్యారెజ్ లోకి మరో స్పెషల్ బైక్ చేరింది. 

టివిఎస్ అపాచి ఆర్ఆర్ 310 బైక్ అప్‌డెటెడ్  వెర్షన్  ఈ వారమే మార్కెట్లోకి విడుదలయ్యింది. ఈ బైక్  ధరను రూ.2.27లక్షలు(డిల్లీ ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. అయితే ఈ  బైక్  కొనుగోలు చేసిన  మొదటి  కస్టమర్ గా ధోని నిలిచాడు.

ధోని ప్రస్తుతం టివిఎస్ స్టార్ సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా అతడికి టివిఎస్ సంస్ధతో చాలా ఏళ్ల అనుబంధం వుంది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ అపాచి ఆర్ఆర్ 310 బైక్ ను కొనుగోలు చేసి దాని అంచనాలను మరింత  పెంచినట్లు మార్కెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇప్పటికే ధోని వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్  వంటి  వింటేజ్ బైక్స్ తో పాటు హెల్‌క్యాట్ ఎక్స్32, డుకాటి 1098, కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14ఆర్, నింజా హెచ్2 బైక్స్ వున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు అపాచి ఆర్ఆర్ 310 బైక్ కూడా చేరింది. 

ఈ బైక్  ప్రత్యేకతలు: 

టివిఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన ఈ మోడల్ లో బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ది చేసిన 313సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ను వాడారు. అలాగే 6-స్పీడ్ సింక్రోమెష్ గేర్‌బాక్స్ అనుసంధానం గల దీనిలో 9,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 34బిహెచ్‌పి పవర్ ప్యొడ్యూస్ అవుతుంది. అలాగే 7500ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios