టీమిండియా క్రికెటర్ అయినా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నా మహేంద్ర సింగ్ ధోని చాలా సింపుల్‌గా ఉంటాడు. అతని నిరాడంబర జీవితానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. తాజాగా అతనిలోని ఈ గుణం మరోసారి బయటపడింది.

మంగళవారం రాత్రి చెన్నైలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై తన తర్వాతి మ్యాచ్‌లో గురువారం రాజస్థాన్‌తో ఆడాల్సి ఉంది. జైపూర్‌లో జరగాల్సిన మ్యాచ్‌ కోసం కోల్‌కతాతో మ్యాచ్ ముగియగానే చెన్నై జట్టు విమానాశ్రయానికి చేరుకుంది.

నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో బాగా అలసిపోవడంతో ధోని తన భార్య సాక్షితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే కునుకు తీశారు. వారి పక్కనే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సభ్యులు కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మ్యాచ్ ముగిసిన తెల్లవారుజామునే మన ప్రయాణం చేయాల్సి ఉంటే... పరిస్థితి ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన అభిమానులు... ధోనికి స్వప్రయోజనాల కంటే జట్టు గెలుపే ముఖ్యమని.. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనమని అభిమానులు మహీని ఆకాశానికెత్తేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

After getting used to IPL timing this is what happens if u have a morning flight

A post shared by M S Dhoni (@mahi7781) on Apr 9, 2019 at 9:36pm PDT