వాలంటైన్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఓ ట్రెండింగ్ సాంగ్ కి స్టెప్పులు చేసింది. కచ్చా బాదం.. అనే పాట ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆ పాటకు ధనశ్రీ.. తన తల్లితో కలిసి డ్యాన్స్ వేయడం గమనార్హం.
టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ధనశ్రీ వర్మ.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. రీల్స్ చేయడం.. డ్యాన్స్ చేయడం .. ఆ వీడియోలను షేర్ చేయడం ఆమెకు అలావాటే. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ మామూలుగా ఉండదు.
కాగా.. తాజాగా.. ధనశ్రీ వర్మ మరో వీడియో షేర్ చేరసింది. వాలంటైన్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఓ ట్రెండింగ్ సాంగ్ కి స్టెప్పులు చేసింది. కచ్చా బాదం.. అనే పాట ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. ఆ పాటకు ధనశ్రీ.. తన తల్లితో కలిసి డ్యాన్స్ వేయడం గమనార్హం.
ఫిబ్రవరి 14వ తేదీన ఆమె ఆ వీడియో షేర్ చేయగా.. దానికి ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈ వీడియోలో ధనశ్రీ.. రెడ్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించగా.. ఆమె తల్లి రెడ్ కలర్ సల్వార్ సూట్ ధరించారు. ఈ వీడియోని షేర్ చేసిన ఆమె.. దానికి ‘My forever Valentine’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక వీరి వీడియోకి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.
ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారని.. వీడియో బాగుందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరు కూడా వీడియో చూసేయండి.
