Asianet News TeluguAsianet News Telugu

గ‌ల్లీ గేమ్ ఆడుతున్న ఢిల్లీ.. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానం కోసం పోటీ ప‌డుతోందా?

Delhi Capitals IPL 2024 : ఐపీఎల్ లో బ్యాటింగ్ విష‌యంలో ప‌లువురు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయర్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. బౌలింగ్ విభాగం తీవ్రంగా దెబ్బ‌కొడుతోంది. అయితే, కీల‌క స‌మ‌యంలో ఢిల్లీ చెత్త గేమ్ తో వ‌రుస‌గా ఓట‌మిపాల‌వుతోంది. 

Delhi is playing gully cricket. Is ipl 2024 competing for the last spot in the points table? These are the reasons for the defeat RMA
Author
First Published Apr 10, 2024, 4:39 PM IST

Delhi Capitals IPL 2024 : భార‌త స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్.. ధ‌నాధ‌న్ హిట్టింగ్ కు పెట్టింది పేరు, ఐపీఎల్ లో చాలా సీజ‌న్ల‌లో అద్భుత‌మైన ఆట‌తో రాణించిన డేవిడ్ వార్న‌ర్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, ఎన్రిక్ నార్కియా వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నా ఢిల్లీకి ఐపీఎల్ 2024 క‌లిసి రావడం లేదు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానం కోసం పోటీ ప‌డుతూ ఢిల్లీ గ‌ల్లీ గేమ్ ఆడుతుందా? అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు క్రికెట్ ల‌వ‌ర్స్. ఐదు మ్యాచ్ ల‌ను ఆడిన ఢిల్లీ ఇప్పటివ‌ర‌కు ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలిచింది. ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో కొన‌సాగుతోంది.

ఢిల్లీని దెబ్బ‌కొడుతున్న బౌల‌ర్లు.. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల పరిస్థితిని గ‌మ‌నిస్తే ఈ సీజ‌న్ లో వారి వ్య‌క్తిగ‌త గ‌త‌ రికార్డుల‌కు త‌గ్గ‌ట్టుగా రాణించ‌లేక‌పోతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ బౌలర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. చెత్త రికార్డుల‌ను న‌మోదుచేస్తూ భారీ ముల్యం చెల్లిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు 234, 272 పరుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఇది వారి ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఫాస్ట్ బౌలర్లు ఎన్రిక్ నార్కియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్నారు. నార్కియా 13.43 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయ‌డం ఢిల్లీని దెబ్బ‌కొడుతోంది. ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో నార్కియా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 32 పరుగులు స‌మ‌ర్పించుకుని చెత్త‌రికార్డును న‌మోదుచేశాడు. అన్రిచ్ నోర్ట్జే  మొత్తంగా ఆరు వికెట్లు తీసిన ఇలాంటి బౌలింగ్ తో ఢిల్లీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నేది క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

IPL 2024 : ట్రిస్ట‌న్ స్టబ్స్ దేబ్బ‌కు స్ట‌న్న‌య్యారు.. ఎవ‌డ్రా వీడు ఇలా కొట్టేశాడు.. !

అలాగే, ఖలీల్ అహ్మద్ 8.50 ఎకానమీ రేటుతో 7 వికెట్లు తీయగా, ఇషాంత్ 11.09 ఎకానమీ రేటుతో మూడు వికెట్లు తీశాడు. స్పిన్ బౌలర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ల ఎకానమీ రేటు ఖచ్చితంగా 8 కంటే తక్కువ. అయితే గాయం కారణంగా కుల్దీప్ గత మూడు మ్యాచ్‌ల్లో ఆడలేదు. మొత్తమ్మీద, ఢిల్లీ క్యాపిటల్స్  కు చెందిన సూప‌ర్ బౌల‌ర్ల నుంచి సమర్థవంతమైన ప్రదర్శనను పొందలేకపోతుందని చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గ‌జాల సేవ‌లు పొందుతున్నా జ‌ట్టు గెలుపుబాట‌లోకి రాక‌పోవ‌డం క్రికెట్ ల‌వ‌ర్స్ ను షాక్ కు గురిచేస్తోంది.

ఇదే స‌మ‌యంలో బ్యాటింగ్ విష‌యంలో కూడా ఢిల్లీ కీల‌క స‌మ‌యంలో ఆట‌గాళ్లు విఫ‌ల‌మ‌వుతున్నారు. అంటే  ఢిల్లీ బ్యాటింగ్ విభాగం కలిసి క్లిక్ చేయడంలో విఫలమైంది. ట్రిస్టన్ స్టబ్స్ ఐదు ఇన్నింగ్స్‌లలో 174 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 158 పరుగులు చేయగా, కెప్టెన్ రిషబ్ పంత్ 153 పరుగులు చేశాడు. అయితే, ఒక‌రు రాణించిన స‌మ‌యంలో మ‌రో ప్లేయ‌ర్ రాణించ‌క‌పోవ‌డం ఢిల్లీ గెలుపు అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తోంది. పృథ్వీ షా మంచి ఆట‌తో రాణిస్తున‌నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్ చాలా నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 61 పరుగులు మాత్రమే చేశాడు. క‌లిసి రాణించ‌క‌పోతే ఢిల్లీ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌లు గొప్ప‌గా ఉండ‌వ‌నీ, గెలుపు ట్రాక్ లోకి రాలేద‌ని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

భ‌య్యా హాఫ్ సెంచ‌రీ అయినా కొట్ట‌నివ్వ‌చ్చు క‌దా.. !

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios