Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి మనన్ శర్మ రిటైర్మెంట్... అవకాశాల కోసం అమెరికా బాట పట్టిన కోహ్లీ స్నేహితుడు...

మొన్న స్మిత్ పటేల్, నిన్న ఉన్ముక్త్ చంద్... ఇప్పుడీ లిస్టులో మరో క్రికెటర్‌గా మనన్ శర్మ... అవకాశాల కోసం టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, అమెరికాకి వలస వెళ్లిపోతున్న క్రికెటర్లు...

Delhi All-rounder Manan Sharma announced retirement for India and moved to USA
Author
India, First Published Aug 21, 2021, 5:10 PM IST

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ కొత్త క్రికెటర్, టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పటికే రిజర్వు బెంచ్ కూడా పటిష్టంగా మారడంతో మూడు జట్లకు సరిపడా క్రికెటర్లు, తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నాడు. దీంతో రాని అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండలేక, అమెరికా దారి పడుతున్నారు కొందరు యువ క్రికెటర్లు...

మొన్న స్మిత్ పటేల్, నిన్న ఉన్ముక్త్ చంద్... టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, అమెరికాకి వలస వెళ్లిపోగా, ఇప్పుడీ లిస్టులో మరో క్రికెటర్ చేరాడు... అతని పేరు మనన్ శర్మ. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ శర్మ కొడుకైన మనన్ శర్మ, ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు కూడా...

అండర్19 వరల్డ్‌కప్ 2010 జట్టులో సభ్యుడైన మనన్ శర్మ, 2017లో ఢిల్లీ జట్టు తరుపున ఆరంగ్రేటం చేశాు. 35 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 27.45 సగటుతో 1208 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. లిస్టు ఏ క్రికెట్‌లో 560 పరుగులు చేసిన మనన్ శర్మ, బౌలింగ్‌లోనూ 145 వికెట్లు పడగొట్టాడు.

2016లో మనన్ శర్మను బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే యువ క్రికెటర్లకు పెద్దగా అవకాశం రానట్టే, మనన్ శర్మ కూడా ఐపీఎల్‌లో తుదిజట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు...
‘మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ లీగ్ నా క్రికెట్ కెరీర్‌ గ్రాఫ్‌ను మార్చేస్తుందని ఆశిస్తున్నా... ’అంటూ తెలిపాడు 30 ఏళ్ల ఢిల్లీ ఆల్‌రౌండర్ మనన్ శర్మ..

Follow Us:
Download App:
  • android
  • ios