INDvsAUS: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే అవుతోంది.  అటు వన్డేలతో పాటు టీ20లలో  కూడా సెంచరీ బాదిన ఈ పంజాబీ కుర్రాడికి  యూత్ లో ఫాలోయింగ్ కూడా  బాగానే పెరిగింది.  

భారత జట్టులోకి చిన్న వయసులోనే వచ్చినా కొద్దిరోజుల పాటు కుదురుకోవడానికి సతమతమైన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పుడు భావి భారత స్టార్ గా అవతరించాడు. గవాస్కర్ తర్వాత సచిన్.. సచిన్ తర్వాత కోహ్లీ.. కోహ్లీ తర్వాత ఎవరు..? అన్న ప్రశ్నలకు తానున్నానని వస్తున్న గిల్ ను అందరూ టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు. కాగా న్యూజిలాండ్ తో ఇటీవలే అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మూడో టీ20లో గిల్ కు మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అమ్మాయి టిండర్ ద్వారా ప్రపోజ్ చేసిన ఫోటో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

 మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ అమ్మాయి.. ‘టిండర్.. శుభ్‌మన్ తో మ్యాచ్ కలుపు..’అని బ్యానర్ పట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఇదే ఫోటోను స్ఫూర్తిగా తీసుకున్న టిండర్.. నాగ్‌పూర్ లో రచ్చ రచ్చ చేస్తున్నది. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ కు వచ్చిన గిల్ కు టిండర్.. వినూత్న రీతిలో స్వాగతం పలికింది.

అహ్మదాబాద్ లో బ్యానర్ పట్టుకుని వైరల్ అయిన అమ్మాయి ఫోటోను పెట్టి.. ‘శుభ్‌మన్ ఇటు కొంచెం చూడు బాబు..’ అని భారీ హోర్డింగుల మీద రాసుకొచ్చింది. వీటిని టీమిండియా వెటరన్ పేసర్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు భారత జట్టుకు ఎంపికైన ఉమేశ్ యాదవ్ తన ట్విటర్ లో షేర్ చేశాడు. ‘మొత్తం నాగ్‌పూర్ నీ వెనకాలే పడుతోంది. గిల్ కొంచెం ఇటు చూడవయ్యా..’ అని ఉమేశ్ రాసుకొచ్చాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

కాగా ఇప్పుడు ఈ ట్వీట్ లు, టిండర్ ప్రపోజల్ పై గిల్ స్పందించాడు. తాను కూడా టిండర్ లోకి వస్తున్నానంటూ ట్విటర్ లో అందుకు సంబంధించిన లాగిన్ ఐడీ డీటెయిల్స్ ను షేర్ చేశాడు. డిటేయిల్స్ ను షేర్ చేస్తూ.. ‘నేను చూశాను. ఇప్పుడు నువ్వు కూడా చూస్తే ఇక పండగే...’అని రాసుకొచ్చాడు. టీమిండియాలో దుమ్ము రేపుతున్న ఈ కుర్రాడు ఇక టిండర్ లో ఎంత రచ్చ చేస్తాడో మరి..?

Scroll to load tweet…