కటక్: వెస్టిండీస్ తో కటక్ లోని బారాబతి స్టేడియంలో ఈ నెల 22వ తేదీన జరిగే మూడో వన్డేకు భారత బౌలర్ దీపక్ చాహర్ దూరమవుతున్నాడు. గాయం కారణంగా అతను జట్టు నుంచి తప్పుకున్నాడు. చాహర్ స్థానంలో నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. 

విశాఖపట్నంలో బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో వీపు కింద నొప్పితో చాహర్ బాధపడ్డాడు. బీసీసీ వైద్య బృందం అతన్ని పరీక్షించి, కొంత విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పింది. దీంతో మూడో వన్డేకు అతను దూరమవుతున్నాడు. 

 

ఇప్పటికే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ట్వంటీ20 సిరీస్ తర్వాత అతను జట్టు నుంచి వైదొలిగాడు. మూడో వన్డే కోసం భారత జట్టు ఇప్పటికే కటక్ చేరుకుంది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివం దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ